Home / Entertainment / Video: న్యాచురల్ స్టార్ నాని కారుకి ఆక్సిడెంట్,…!

Video: న్యాచురల్ స్టార్ నాని కారుకి ఆక్సిడెంట్,…!

Author:

న్యాచురల్ స్టార్ నాని ప్రయాణిస్తున్న కారుకి ఆక్సిడెంట్ అయింది, శుక్రవారం రోజు రాత్రంతా షూటింగ్ చేసుకుని ఉదయం 4 గంటల సమయంలో గచ్చిబౌలిలోని తన ఇంటికి వెళ్తుండగా జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెం 45లో నాని ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో నాని, డ్రైవర్ శ్రీనివాస్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు, అనంతరం నాని మరో కారులో ఇంటికి వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కారు డ్రైవర్ శ్రీనివాస్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మద్యం సేవించలేదని తేలింది. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందని డ్రైవర్ వివరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో ఆ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ప్రమాద ఘటనపై అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని నాని ట్వీట్ చేశారు. ఆ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని – కంగారు పడాల్సిన పనిలేదని ట్వీట్ చేశారు. యుద్ధానికి కొంతకాలం విరామం ప్రకటించానని…`కృష్ణార్జున యుద్ధం` షూటింగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వారం రోజుల్లో తాను కోలుకుంటానని – మళ్లీ యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. అయితే నాని పెదవికి స్వల్ప గాయం అయిందని – అందుకే వారం రోజుల విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది.

(Visited 426 times, 1 visits today)