క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తున్న యంగ్ టైగర్ తారక్ నాన్న కు ప్రేమతో పేరు మారబోతోందా? ఔననే అంటున్నారు టాలీవుడ్ జనాలు. సుకుమార్ దర్శకత్వం లో ఇప్పటికే లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న యంగ్ టైగర్ సినిమా కి టైటిల్ “నాన్నకు ప్రేమతో’ అనుకున్నట్టు తెలిసిందే. ఐతే ఇప్పటికే నాన్నకు ప్రేమతో అన్న టైటిల్ లో “న” అనే అక్షరం తనకు సెంటిమెంటల్ గా అచ్చిరాలేదనీ, “న” అనే అక్షరం తో మొదలైన సినిమాలన్నీ ఇప్పటిదాకా ఫ్లాపు లే అయ్యాయనీ కాబట్టి ఆ టైటిల్ కి ముందు “మా” అనే అక్షరం చేర్చి “మా నాన్న కి ప్రేమతో” అని మార్చారట. ఐతే మళ్ళీ ఏమైందో గానీ ఇప్పుడు మళ్ళీ ఆ పేరుని కూడా మార్చాలని అనుకుంటున్నాడట సుకుమార్.
ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన బీవీయెస్సెన్ ప్రసాద్ నిన్ననే ఫిలిం చాంబర్ లో “అభిరాం’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారట. ఇది జూనియర్ ఏన్ టీ ఆర్ కోసమే అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అంతే కాక ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న చిత్రం కోసం అని అన్నారట ప్రసాద్. ఇంకోన్ని రోజుల్లో అసలు యంగ్ టైగర్ “మా న్నాన కి ప్రేమతో” అంటాడా!, లేక “అభిరాం” గా వస్తాడా అన్నది తేలనుంది. షూటింగ్ పూర్తి చేసుకొని మరికొద్ది రోజుల్లో ఈ చిత్ర యూనిట్ ఇండియాకి రానుంది. అప్పుడే అధికారికంగా టైటిల్ ఏమిటన్నది ప్రకటిస్తారనీ అనుకుంటున్నరు.. ఇదిలా ఉంటే ఈ సినిమా లో ఒక ఐటం సాంగ్ చేయటానికి ఒక స్టార్ హీరోయిన్ ని వెతుకుతున్నారట సుకుమార్. ఇంకా ఎవరన్నదీ తెలియరాలేదు గానీ శ్రియ గానీ, సన్న నడుముపిల్ల ఇలియానా గానీ ఈ యంగ్ టైగర్ పక్కన చిందులేయొచ్చని తెలుస్తోంది. మొత్తం సినిమాకే సెంట్రరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుందట . మరి అంత ముఖ్యమైన సాంగ్ కి ఎవర్ని ఎంచుకుంటారో చూడాలి..