తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ మార్పు వివాదం తాజాగా మళ్ళీ ఇంకొక సరి తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ పదవి నుంచి నరసింహన్‌ను తొలిగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఐతే దీనికి భిన్నం గా మరో వార్త కూడా వినిపిస్తోంది. స్వాతంత్య్రదినోత్సవ సందర్బంగా ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఏపీ ,తెలంగాణ సీఎంలు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లను ఆహ్వానించినా వారు వెళ్లకపోవడటంతో గవర్నర్ నరసింహన్‌ను మనస్తాపం చెందారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోతాను పదవి నుంచి తప్పుకుంటానని ఆయన కేంద్రానికి తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ సామరస్యపూరకంగా పరిష్కారం కావాలని, కేంద్రం యోచిస్తోంది. ఇందుకు న్యాయ నిపుణులైన వారతై బాగుంటుందని భావిస్తున్నత్తు తెలుస్తోంది. ఐతే నరసింహన్ స్థానంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా రాబోయేది ప్రస్తుత కేరళ గవర్నర్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పళనిస్వామి సదాశివం గారేనా? అంటే ఔననే అంటున్నాయి కేంద్రంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు, న్యాయబద్ధంగా వ్యవహరించేందుకు జస్టిస్ సదాశివం వంటి అత్యున్నత స్థానంలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి సేవలు అవసరమన్న చర్చ కేంద్రంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
20014 సెప్టెంబర్ 5న షీలా దీక్షిత్ స్థానంలో జస్టిస్ సదాశివం కేరళ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.నరసింహన్ మాదిరిగానే జస్టిస్ సదాశివం కూడా తమిళనాడుకు చెందినవారే కావడం గమనార్హం. ఐతే ఏపీకి చెందిన సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్‌వీ శేషగిరిరావును గవర్నర్ గా నియమించాలని కోరుతూ కూడా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇక రాబోయే గవర్నర్ ఎవరు అన్న విషయం పై అందరూ ఉత్కంఠత తో ఎదురు చూస్తున్నారు.. కేరళ గవర్నర్‌గా మాజీ చీఫ్ జస్టిస్ పీ సదాశివం పేరును కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడూ. భారత అత్యున్నత న్యాయపదవిని నిర్వహించిన వ్యక్తిని గవర్నర్ పదవికి సిఫార్సు చేయడం ఏమిటని రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతిపక్షం అయిన కాంగ్రేస్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. జూలై 2013 నుంచి ఏప్రిల్ 2014 వరకు సదాశివం చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తన పదవీకాలంలో ఆయన ఎన్నో సంచలనాత్మక తీర్పులిచ్చారు. గత సంవత్సర కాలంగా కేరళ గవర్నర్ గా ఆయన పని తీరు పై ఎటువంటి విమర్శలు గానీ, బావుంది అన్న మెప్పులు గానీ ఏమీ లేవు..