అర్నబ్ గోస్వామి తిక్క ప్రశ్నలకి చంద్రబాబు రియాక్షన్ కామెడీగా ఉంటే ఎలా ఉంటుందీ? కే ఏ పాల్ గారి మాటలు మామూలుగానే నవ్వు తెప్పిస్తాయి.. మరి అదే ఇంకాస్త ఫన్ జోడిస్తే..! ఇంకెంత నవ్వుకుంటారు..!! తెలంగాణా ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి స్పీచ్ లు ఎంత పాపులర్ అయ్యాయో తెలుసు కదా అవే మాటతో ఒక స్పూఫ్ తయారు చేస్తే..!? ఈ ఆలోచనలే క్రేజీ గా ఉన్నాయ్ కదా…! అదే పని చేసేసాడు ఓ కుర్రాడు.
నవీన్ గౌడ్ అనే కుర్రాడు చేసిన ఒక స్పూఫ్ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పండిస్తోంది. వివిద నాయకుల, సెలెబ్రిటీల మాటలతో నవీన్ ఒక్కడే అన్ని పాత్రలనీ అనుకరిస్తూ చేసిన వీడియో అదిరిపోయే సక్సెస్ ని సాధించింది. నవీన్ ఆయా సెలబ్రిటీలను అనుకరించేటప్పుడు వారి మ్యానరిజం, మామూలుగా ఉండే ఊత పదాలనీ కూడా చక్కగా వాడుకున్నాడు. మంచి నటుడుగా ఖచ్చితంగా ఎదిగే లక్షణాలు ఈ కుర్రాడిలో పుష్కలం గా ఉన్నాయి. తన నటన అద్బుతంగా ఉండి పిచ్చ..పిచ్చగా నవ్విస్తుంది.. కొన్నాళ్ళు గా ఫేస్ బుక్ లోనూ వాట్స్ ఆప్ లోనూ విపరీతంగా పాపులర్ అయిన ఈ వైరల్ వీడియో ని మీరూ ఓ సారి చూసి నవ్వుకోండి మరి…