Home / General / వచ్చే ఐపీఎల్ నుండి లీగ్ మధ్యలో క్రికెటర్స్ ఏ జట్టుకైనా జంప్ చేయొచ్చు.

వచ్చే ఐపీఎల్ నుండి లీగ్ మధ్యలో క్రికెటర్స్ ఏ జట్టుకైనా జంప్ చేయొచ్చు.

Author:

వచ్చే ఐపీఎల్ సీజన్ లో జరగబోయే మార్పుల గురుంచి ఈరోజు ముంబై లో అన్ని జట్ల యజమానులతో బీసీసీఐ అధికారులు సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానం, జీతాలపై పరిమితి తదితర అంశాలపై చర్చలు జరిగాయి.

ఐపీఎల్

ఈ సమావేశంలో వచ్చే ఐపీఎల్ నుండి జట్టులో ఉండి కూడా మ్యాచ్ ఆడటానికి అవకాశం రాణి క్రికెటర్లు లీగ్ మధ్యలోనే వేరే జట్టుకి మారే అంశంపై ముఖ్యంగా చర్చ చేసారు, లీగ్ లో ప్రతి జట్టు 14 మ్యాచ్ లు ఆడుతుంది, ఈ మ్యాచ్ లలో కొంతమంది ఆటగాళ్ళకి ఆడే అవకాశం రాదు అయిన కూడా వాళ్లంతా ఆ జట్టుతో ఉండాల్సిందే, ఇక నుంచి ఆడే అవకాశం రాని ఆటగాళ్లు అదే జట్టును అట్టిపెట్టుకునే ఉండాల్సిన అవసరం లేకుండా మధ్యలోనే ఆ జట్టును వీడి మరో జట్టులోకి వెళ్లి మ్యాచ్ లు ఆడేలా ప్రతిపాదనలు చేసారు, ఈ ప్రతిపాదనానికి అన్ని జట్ల యజమానులు కూడా అంగీకరించడంతో వచ్చే ఐపీఎల్ సీజన్ 11 నుండే దీనిని అమలు చేయనున్నారు.

ఇలా లీగ్ మధ్యలో జట్టు మారే విధానం యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్ లో ఎప్పటినుండో ఉంది, క్రికెట్ లో మొదటిసారి మన ఐపీఎల్ లోనే చూడబోతున్నాం..! మొదటి ఏడూ మ్యాచ్ లలో ఆవకాశం రాని ఆటగాళ్లుకి మాత్రమే ఇలా లీగ్ మధ్యలో వేరే జట్టుకి వెళ్లే ఆవకాశం ఇవ్వనున్నారు, ప్రతి ఐపీఎల్ లో చాలామంది ప్రతిభావంతమైన క్రికెటర్లకి ఆడే ఆవకాశం రావట్లేదు..చూద్దాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏ ఆటగాడు మొదటగా జట్టు మారుతాడో..!

(Visited 142 times, 1 visits today)