Home / Inspiring Stories / తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియాని తొలగించి సింధుని చేయాలనే డిమాండ్ తో మీరు ఏకీభవిస్తారా..?

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియాని తొలగించి సింధుని చేయాలనే డిమాండ్ తో మీరు ఏకీభవిస్తారా..?

Author:

ఒలంపిక్స్ పోటీలలో సిల్వర్ మెడల్ గెలిచిన మొట్టమొదటి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది, ఒలంపిక్స్ బాడ్మింటన్ పోటీలలో ఫైనల్ కి చేరి భారతదేశాన్ని మొత్తాన్ని గర్వించేలా చేసింది, ఫైనల్ మ్యాచ్ లో కూడా వరల్డ్ నెంబర్ 1 అయిన కరోలినా మారిన్ తో మన సింధు హోరాహోరీగా పోరాడి తృటిలో స్వర్ణ పతాకాన్ని చేజార్చుకుంది, కానీ తన ఆటతో భారత దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది.

PV-Sindhu-Olympics-Medal

రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాని తొలగించి పీవీ సింధు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించాలనే డిమాండ్ బాగా ఊపందుకుంది, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ తెలంగాణ కోసం సానియా మీర్జా ఏం చెయ్యలేదని, కనీసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలలో కూడా పాల్గొనటం లేదని ఆమెకి బదులుఒలింపిక్స్ లో దేశం గర్వించేలా ఆటతీరు కనబరిచిన పీవీ సింధుని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించాలని నెటిజన్లు తమ అభిప్రాయాలని ప్రకటిస్తున్నారు.

సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని చెబుతున్న వారు చూపుతున్న కారణాలు:

sania-mirza

  • తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఉండి తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలని ప్రతిబింబించలేకపోవడం.
  • తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి డుమ్మా కొట్టి, వేరే కార్యక్రమంలో పాల్గొని ఫోటోలకు ఫోజులివ్వడం.
  • పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకోవడం.
  • తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కూడా అంత యాక్టివ్ గా పాల్గొనకపోవడం. ఆటకంటే
  • యాడ్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుందనే ప్రచారం.
  • పక్క హైదెరాబాదీ కాకపోవడం(ముంబై లో పుట్టింది),

P.V సింధును తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలనే వారు చెబుతున్న కారణాలు:

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియాను పక్కకు పెట్టి P.V సింధు ను చేయాలనే వాదనను మీరు ఏకీభవిస్తున్నారా?

  • తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల పండుగ నాడు బోణమెత్తడం.
  • పక్కా హైద్రాబాదీ అవ్వడం.
  • అన్నింటికి మించి పతకం కోసం ఎదురుచూస్తున్న యావత్ భారతదేశానికి ఒలంపిక్స్ లో వెండి పతాకాన్ని గెలిచి చరిత్ర సృష్టించడం.
  • దేశమంతా తెలంగాణ పేరును మార్మోగేలా చేయండం.
  • ఒలంపిక్స్ లో పతకం గెలిచి చాలామందికి స్ఫూర్తిదాయంగా నిలవడం.
  • ఆట తప్ప వేరే వ్యాపకాలు లేకపోవడం.

Source: Ap2tg.com

Must Read: ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించిన సింధు.

(Visited 215 times, 1 visits today)