Home / Latest Alajadi / దేవుడు చెప్పిందే చేసానని 130 మందిని పెళ్ళాడాడు.

దేవుడు చెప్పిందే చేసానని 130 మందిని పెళ్ళాడాడు.

Author:

ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోవచ్చని 130 మందిని పెళ్ళాడాడు నైజీరియాకు చెందిన మొహమ్మద్‌ బెలో అబూ బకర్‌. పెళ్ళి చేసుకోవడమే కాదు అంత మంది భార్యలతో సంసారం చేసి 203 మంది పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. ఈ 93 ఏళ్ల అబూ బకర్‌ ను స్థానికులు బాబా అని పిలుచుకుంటారు, మత ప్రభోదకుడిగా జీవితం ప్రారంభించిన బాబా పవిత్ర గ్రంధానికి తనదైన రీతిలో వింత భాష్యాలు చెప్పడంతో వివాదాస్పదంగా మారాడు. అతను చెప్పిన దాంట్లో బాగా పాపులర్ అయిన భోదన “ఒక మగాడు ఎంతమంది మహిళల్ని అయినా పెళ్లి చేసుకోవచ్చని” చెప్పడమే కాకుండా దానినే ఆచరించి చూపాడు. కాని చివరికి 93 యేళ్ళ వయసులో ఎవరికి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు.

man with 130 wives

నైజీరియాలోని బిడా రాష్ట్రంలో ఒక రెండంతస్తుల భారీ భవనంలో ఆయన కుటుంబం అంతా నివసించేది, అబూ బకర్ కుటుంబం ప్రంపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా రికార్డులకు కూడా ఎక్కింది. 2008 లో తనకు నచ్చదంలేదని ఒకటేరోజు 82 మంది భార్యలకు విడాకులు ఇచ్చి అప్పట్లో సంచలనం శృష్టించాడు అబూ బకర్. తాను దేవుడి చెప్పిందే చేసానని చెప్పుకునే బాబా చివరికి 93 యేళ్ళ వయసులో ఎవరికి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు.

(Visited 1,230 times, 1 visits today)