Home / Entertainment / నిన్ను కోరి రివ్యూ & రేటింగ్.

నిన్ను కోరి రివ్యూ & రేటింగ్.

నిన్ను కోరి రివ్యూ

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌, మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృథ్వీ.. తదితరులు

Directed by: శివ నిర్వాణ

Produced by: దానయ్య డి.వి.వి.

Banner: డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Music Composed by: గోపీ సుందర్‌

కొత్త కొత్త కథలని ఎంచుకుంటూ వరుస హిట్లు కొట్టేస్తున్న న్యాచురల్ స్టార్ నాని, మరోసారి కథని బలంగా నమ్మి శివ నిర్వాణా అనే కొత్త డైరెక్టర్ తో చేసిన సినిమా ‘ నిన్ను కోరి ‘, బలమైన కథనంకి, భాగోద్వేవాలకి చోటున్న కథతో తెరకెక్కించిన నిన్ను కోరి సినిమా ఈరోజే విడుదల అయింది, కథని మాత్రమే నమ్మి నివేద థామస్, ఆది పినిశెట్టిలతో నాని చేసిన సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి..!

కథ:

వైజాగ్ లో ఉంటూ తన కెరీర్ కోసం చదువుకుంటున్న ఉమామహేశ్వరావుకి (నాని ) అనుకోకుండా ఒక పరిచయం అయిన ఒక అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు, ఆ అమ్మాయే పల్లవి (నివేద థామస్), పల్లవి కూడా అతడిని ప్రేమిస్తుంది, ఇంతలో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో పల్లవి పెళ్లి చేసుకోవాలని ఉమాపై ఒత్తిడి చేస్తుంది, కొన్ని కారణాల వల్ల పల్లవి, అరుణ్ (ఆది పినిశెట్టి) ని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతుంది, ఉమా కూడా ఒక పని కోసం అమెరికా వెళ్తాడు, ప్రేమలో విఫలమైన ఉమా పల్లవి జ్ఞాపకాలతో బతుకుతుంటాడు, ఎప్పటికైనా పల్లవి తన దగ్గరికి వస్తుంది అని ఎదురుచూస్తుంటాడు, ఉమా కోరుకున్నట్టుగానే పల్లవి తన కోసం వస్తుంది..! కానీ అరుణ్ తో విడిపోయి మాత్రం కాదు,,! కొన్ని కారణాల వల్ల పల్లవి ఉమామహేశ్వరావు దగ్గరికి వస్తుంది..! అసలు పల్లవి ఏ పరిస్థితులలో ఉమా దగ్గరికి వచ్చింది..? అసలు ఉమా పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? మళ్ళీ ఉమా – పల్లవి ఒక్కటయ్యారా..? పల్లవిని పెళ్లి చేసుకున్న అరుణ్ పరిస్థితి ఏమిటి..? అనేది అసలు కథ..!

అలజడి విశ్లేషణ:

ఈ మధ్య ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసే సినిమాలకే పట్టం కడుతూ వస్తున్నారు, మంచి ఫీల్ ఉన్న ప్రేమ కథలతో సినిమాలు తీయటం రిస్క్ కాబట్టి ఎవరు ఆ దిశగా సినిమాలు తీయట్లేరు, ప్రతిసారి కొత్త కథలతో వచ్చి తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టే నాని ఈసారి భాగోద్వేగాలతో ముడిపడిన కథతో అదికూడా ఒక కొత్త దర్శకుడిని నమ్మి సినిమా చేసి పెద్ద సాహసమే చేసాడు, కొత్త దర్శకుడు అయిన శివ నిర్వాణా ప్రస్తుతం సమాజంలో ఉన్న కథని తీసుకొని ఆ కథకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా సీన్లని అద్భుతంగా తెరకెక్కించాడు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లని, కొన్ని డైలాగ్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు.

‘జీవితం చాలా అవకాశాలను ఇస్తుంది. దానికి మనం ఒక్క అవకాశం ఇద్దాం’ అనే ఓ అంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సున్నితమైన ఈ కథాంశంలో అంతే సున్నితంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. చూసేటప్పుడు చాలా సినిమాలు గుర్తుకొచ్చినప్పటికీ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. నాని గత సినిమాల్లా మరీ ఎక్కువ కామెడీని ఆశిస్తే మాత్రం నిరాశపడక తప్పదు. భావోద్వేగాలకే పెద్ద పీట వేస్తూ వీలైన చోట నాని మార్కు కామెడీతో సన్నివేశాలను తీర్చిదిద్దారు, కొన్ని సన్నివేశాలు సాగదీసినప్పటికీ ప్రేక్షకుల మనస్సులో ఈ సినిమా నిలిచిపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకి కనెక్ట్ అయిన వాళ్ళ మనస్సులో మాత్రం ఒక మంచి ఫీల్ ఉన్న సినిమాగా చాలాకాలం నిలిచిపోతుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్:

నాని: నటనలో నాని గురుంచి కొత్తగా చెప్పాల్సింది ఏమిలేదు, ‘నిన్ను కోరి’లో మరింత బాగా చేశాడనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలోనూ అతడి ఆత్మవిశ్వాసం.. పరిణతి కనిపిస్తుంది, నానిని న్యాచురల్ స్టార్ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు.

నివేదా థామస్: నానితో పోటీపడి నివేదా నటించింది, నివేదా హావభావాలు కట్టిపడేస్తాయి. మామూలు సన్నివేశాల్లో కూడా కళ్లతో చక్కటి భావాలు పలికిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది.

ఆది పినిశెట్టి: నటనలో ఒక కొత్తరకం ఆదిని ఈ సినిమాలో చూస్తాం, ‘సరైనోడు’లో ఆదిని చూసి.. ఈ సినిమాలో అతణ్ని చూస్తే ఆశ్చర్యపోతాం. భావోద్వేగాలు పలికించడంలో ఆది ప్రత్యేకత ఈ సినిమాలో కనిపిస్తుంది.

మురళి శర్మ, పృథ్వీ తదితరులు కూడా బాగానే చేసారు.

ప్లస్ పాయింట్స్ :

  • కథ , కథనం
  • నాని, నివేదా ల పెర్ఫార్మన్స్
  • కెమెరా వర్క్
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

  • అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు

అలజడి రేటింగ్ : 3/5

పంచ్ లైన్ : నిన్ను కోరి.. ‘నెమ్మదిగా’ మనసు లోతుల్లోకి!

(Visited 2,383 times, 1 visits today)