Home / Inspiring Stories / నిర్భయను కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని ఉరి తీయాల్సిందే: సుప్రీం కోర్టు.

నిర్భయను కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని ఉరి తీయాల్సిందే: సుప్రీం కోర్టు.

Author:

దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థిని నిర్భయపై జరిగిన అత్యాచారం దేశం మొత్తం తల దించుకునేలా చేసింది. ఆ సంఘటన జరిగిన నాలుగు సంవత్సరాలు తరువాత ఇప్పుడు ఆ కేసులోని నలుగురు నిందితులకు ఉరి శిక్షను అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు లో నిందితులు నిర్భయ పట్ల కిరాతకంగా ప్రవర్తించారని వారికి క్రింది కోర్టులు విధించిన ఉరి శిక్షను అమలు చేయాలని సూచిస్తూ నలుగురు నిందితులు ముఖేశ్‌, వినయ్‌, అక్షయ్‌, పవన్‌లు ఉరి శిక్షకు వ్యతిరేకంగా చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించింది. దానితో నిర్భయ తల్లిదండ్రులు తమ కూతురికి న్యాయం జరిగిందని ప్రకటించి హర్షం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా తమ కూతురికి న్యాయం జరిగిందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని వారు వ్యాఖ్యానించారు.

nirbhaya case judgement

2012 డిసెంబర్‌ 16న దేశ రాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థిని నిర్భయపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన యావత్ భారత దేశాన్ని కుదుపేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆరుగురిలో ఒకరిని జైలులోనే ఇతర ఖైదీలు కొట్టి చంపగా, మరో నిందితుడు మైనర్‌ కావడంతో ఉరి శిక్ష నుండి బయటపడ్డాడు. మిగిలిన నలుగురికి క్రింది న్యాయస్థానాలు మరణశిక్షను విధించాయి కాని ఆ నలుగురు తమకు విధించిన మరణ శిక్షపై సుప్రీం కోర్టుకు వెళ్ళారు కాని అక్కడ కూడా వారికి ఎదురు దెబ్బే తగిలింది.

(Visited 656 times, 1 visits today)