టాలీవుడ్ లో సీనియర్ హీరోలకి తమ్ముడిగా జూనియర్ హీరోలకి అన్నగా ఎప్పుడు ముందు ఉండే హీరో శ్రీకాంత్. చాలా సంవత్సరాలుగా తెలుగు పరిశ్రమలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు తన కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ అక్కినేని నాగార్జున నిర్మిస్తూ ఒక ముఖ్య పాత్రలో నటించిన చిత్రం నిర్మలా కాన్వెంట్ ఈ రోజు మన ముందుకు వచ్చింది.
కథ :
భూపతి నగరం అనే ఒక మారుమూల పల్లెటూరిలో ఈ సినిమా మొదలవుతుంది. ఆక్కడ 99 ఎకరాల పెద్ద భూస్వామి అయినా రాజుగారికి ఎకరం రైతు అయినా వీరయ్య (ఎల్.బి.శ్రీరామ్)కి పడదు. ఆ ఆసామి తక్కువ కులానికి చెందిన వీరయ్యను అలాగే తన కులానికి చెందిన వారిని గుడిలోకి రానివ్వకుండా అలాగే చెరువులో నీటిని తాకడానికి, తాగడానికి కానీ వీల్లేదని ఆంక్షాలు పెడుతాడు. దానికి కారణం వీరయ్య దగ్గర ఉన్న ఎకరం పొలం ఎలాగైనా లాగేసుకోవాలని ఆ భుసామి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఊరిలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలో భుసామి మనుషులు వీరయ్యను చంపేస్తారు. వీరయ్య చనిపోతూ ఎట్టి పరిస్థితులలో ఉన్న ఎకరం పొలం అమ్మకూడదు అంటూ తన కొడుకు సూరయ్య (సూర్య) దగ్గర మాట తీసుకోని చనిపోతాడు. సూరయ్య తన తండ్రి మరణాంతరం క్రిష్టియన్ మతంలోకి మారుతాడు. అతని కొడుకే మన హీరో శ్యామ్యూల్స్ (రోషన్).
రాజు గారి కొడుకు( ఆదిత్య మీనన్)కి ఒక కూతురు పుడుతుంది. ఆమె పేరు శాంతి(శ్రీయా వర్మ). శ్యామ్యూల్స్, శాంతి ఒకే కాలేజ్ లో చదువుకుంటుంటారు. కొద్దీ రోజుల తరవాత ఇద్దరు ప్రేమలో పడతారు. దీనితో శ్యామ్యూల్స్ జీవితంలో అనుకోని సంఘటనలకు గురికావడం. దానితో హైదరాబాద్ కి ప్రయాణం అవుతాడు. మరి శామ్యూల్స్ జీవితంలోకి నాగార్జున ఎందుకు వచ్చాడు. మరి శ్యామ్యూల్స్ , శాంతి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారా! అనేది మిగతా సినిమా ….
అలజడి విశ్లేషణ :
ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయినా రోషన్ గురించి చెప్పుకోవాలి ముందుగా… రోషన్ చాలా చక్కగా నటించాడు. ఈ సినిమా మొత్తం తన భుజాలపై మోశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనది తొలి సినిమా అంటే ఎవరు నమ్మనంత విధంగా చేసాడు. శ్రీయా తన పరిధి మేరకు చక్కగా నటించింది. ఇక హీరోకి, హీరోయిన్స్ కి ప్రెండ్స్ గా నటించిన వారందరు చాలా బాగా నటించారు.
ఈ సినిమాను మొదటి భాగం రోషన్ మోస్తే, రెండవ భాగం మాత్రం నాగార్జున మోశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌కు లేటెస్ట్ వెర్షన్ చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ అంటూ నాగ్ వెండితెరపై చేసిన సందడి అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్నా కథ తెలిసీ తెలియని చిన్న వయసులో ప్రేమలో పడటం. ఇలాంటి కథని చాలా కేర్ ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. చాలా విమర్శలు ఎదురుకోవలసి ఉంటుంది. ఈ సినిమాలో హీరో, హీరియిన్స్ మధ్య ఎక్కడ అసభ్యంగా చూపించకున్న వారి మధ్య క్యూట్ లవ్ స్టోరీని మాత్రం అందంగా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. అలాగే సినిమాలో ప్రతి సీన్ లో చాలా మంది ఉన్న ఎవ్వరిచే నవ్వించక ప్రయత్నించకపోవడం దర్శకుడు చేసిన పెద్ద తప్పు . ఈ సినిమా ఎంతో కొంత బెటర్ అంటే అది నాగార్జున , హీరో రోషన్ అని చెప్పాలి. ఇందులో రెహమాన్ కొడుకు పాడిన కొత్త..కొత్త .. భాష అనే సాంగ్ ఈ సినిమాకి ముందే చాలా బాగా ఫేమ్ అయింది. ఈ సినిమాలో కూడా చాలా బాగా ప్రెజెట్ చేశారు . ఈ పాట సినిమా కు చాలా భాగా హెల్ఫ్ అయిందనే చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు ఈ సినిమా కోసం చాలా రొటీన్ ప్రేమ కథను ఎంచుకున్నాడు. ఆశించిన స్థాయిలో కథ లేకపోవడమే పెద్దలోటే అని చెప్పాలి. రోషన్ సాలూరి సంగీతం చాలా బాగుంది. అలాగే ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా అద్భుతం అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
అక్కినేని నాగార్జున
రోషన్ నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రపీ
మైనస్ పాయింట్స్ :
పాత కథ
ఫస్టాఫ్
ఎంటర్ టైన్ మెంట్