Home / Entertainment / ఎన్టీఆర్ జనత గ్యారేజ్ లో నితిన్.

ఎన్టీఆర్ జనత గ్యారేజ్ లో నితిన్.

Author:

సమ్మర్ సీజన్లో చివరగా విడుదల అయిన అ..ఆ సినిమా అంచనాలని మించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీసుని షేక్ చేస్తుంది, అమెరికాలో అయితే ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని దున్నుకుంటుంది, చాలా రోజుల తరువాత నితిన్ కి హిట్ సినిమా వచ్చింది, ఈ సినిమా విజయంతో ఫుల్ ఖుషిలో ఉన్నాడు నితిన్ , అ..ఆ ఫుల్ రన్ లో 60 కోట్ల దాకా వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Nithin in Janatha Garage Sets 1

అ..ఆ సక్సెస్ తో సంబరాల్లో మునిగిపోతాడు అనుకున్న నితిన్ ఈరోజు జనతా గ్యారేజ్ సెట్ లో ప్రత్యక్షం అయ్యాడు, ఎన్టీఆర్ తో ఒక సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేసాడు, చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ ని కలిసానని, జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ డాన్స్ స్టెప్స్ లని చూశానని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు, ఇంతకి మనోడు ఎన్టీఆర్ దగ్గరికి మాములుగా కలవడానికే వెళ్ళడా..? లేదా మరే ఏదైనా పని మీద వెళ్ళడా..? అన్న సంగతి మాత్రం చెప్పలేదు.

(Visited 753 times, 1 visits today)