Home / Inspiring Stories / మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధికి అవమానం..!

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధికి అవమానం..!

Author:

మన దేశంలో ఇప్పటివరకు చాలా మంది రాష్ట్రపతిగా చేశారు కానీ వారందరిలో ఏ.పి.జె అబ్దుల్ కలాం గారు మాత్రమే మహోన్నత వ్యక్తిగా నిలిచిపోయారు, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా కేవలం ప్రజల కోసమే పని చేసిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు, అంతటి మహావ్యక్తి సమాధికి ఇప్పుడు అవమానం జరిగింది, కలాం గత యేడాది జూలై 27న షిల్లాంగ్‌లో ఓ విద్యార్థుల సదస్సులో ఆకస్మికంగా మృతి చెందారు, రామేశ్వరం సమీపం పేకరంబు ప్రాంతంలో అంత్యక్రియలు జరిగాయి.

Abdul-Kalam-Graveyard

అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో కలాం స్మారక మండపం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, అందుకోసం 1.5 ఎకరాల భూమిని కూడా కేటాయిచింది, అయితే ప్రస్తుతమున్న 1.5 ఎకరాల స్థలం స్మారక మండపం నిర్మాణానికి చాలదని, అదనంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర సైనిక పరిశోధన అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది, కానీ ఎప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు, ఇంజినీర్లు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నాతమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు, ఈ నెల 27తో కలాం తొలి వర్ధంతి జరుగనున్నప్పటికీ ఆయన స్మారక మండప నిర్మాణపు పనులు మాత్రం ఇంకా చేపట్టలేదు, ఈ నేపథ్యంలో మంగళవారం కలాం సమాధి ప్రాంతం వద్ద కేంద్ర ఆర్కిటెక్‌ ఇంజనీర్లు పరిశీలనలు జరిపారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ కలాం సమాధి ప్రాంతంలో విశాలమైన స్మారక మండపం నిర్మించాల్సి ఉందని, చిల్డ్రన్స్ పార్కు, ఎగ్జిబిషన్ హాలు సిబ్బందికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వీటన్నింటినీ ఒకే ప్రాంగణంలో నిర్మించాలంటే ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన స్థలం చాలదని ఇంజనీర్లు తెలిపారు.

స్వార్ధ, కుల రాజకీయాలతో దేశాన్ని బ్రష్టు పట్టించిన వారికి ఘనంగా జయంతులు, వర్ధంతులు చేసే ప్రభుత్వాలు దేశాన్ని ఎంతో ఉన్నత దిశలో నడిపించిన ఒక మహా వ్యక్తికి సరైన గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో చర్చించి ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Must Read: స్నేహం కోసం తన ప్రాణాలే వదిలి..ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.

(Visited 3,670 times, 1 visits today)