Home / Political / డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికారో..! జైలు శిక్ష ఖాయం…!

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికారో..! జైలు శిక్ష ఖాయం…!

Author:

హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. సామాన్యులు నిభందనలు సరిగ్గానే పాటిస్తున్న ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో అర్దం కాని పరిస్తితి. ఇలా ప్రమాదాలకు కారణం అవుతున్న వారిలో సరైన శిక్షణ లేకుండా రోడ్ల మీదా వాహానాలు నడుపుతున్న వారు మరియు 18 యేళ్ళు కూడా నిండని మైనర్లు ఉంటున్నారు. ఈ ప్రమదాలకు కారణం అవుతున్న వీరిపై ఉక్కుపాదం మోపడానికి ట్రాఫిక్ శాఖ‌ కొత్త చట్టాలను తీసుకురానుంది. ఇక నుండి హైదరాబాద్ లో లైసెన్స్ లేకుండా వాహానం నడిపితే చలాణాకు బదులు ఖచ్చితంగా జైలు శిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. అదే కాకుండా మైనర్లకు వాహానాలు ఇస్తే వారి తల్లితంద్రులకు జైలు శిక్ష విధించాలని కూడా నిర్ణయించింది న‌గ‌ర ట్రాఫిక్ శాఖ‌.

driving licence mandatory

నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సమీక్షించడానికి సోమవారం ట్రాఫిక్‌ పోలీసులు, న్యాయ విభాగం మధ్య జరిగిన సమావేశంలో పైన చెప్పిన నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం నుంచి ఆర్టీఏ అధికారులతో కలిసి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నిభంధనలు ఉల్లంగించిన వారికి జైలుశిక్ష విధించనున్నామని ట్రాఫిక్ శాఖ‌ తెలిపింది, అంతే కాకుండా లైసెన్స్ లేకుండా బండ్లు నడిపేవారి వివరాలతో ఒక డేటాబేస్ తయారు చేసి వారి అధార్ కార్డుకు లింక్ చేస్తామని దీనివలన భ‌విష్య‌త్తులో పాస్ పోర్ట్‌, వీసా, ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం వెళ్ళినపుడు ఇబ్బందుల‌పాలు కాక త‌ప్ప‌ద‌ని ట్రాఫిక్ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. అందుకే లైసెన్స్ లేనివారికి, మైనర్లకు మీ వాహానాలు ఇవ్వకండి.

(Visited 546 times, 1 visits today)