Home / Inspiring Stories / స్మార్ట్ ఫోన్,ల్యాప్ టాప్ స్క్రీన్ లపై పడిన గీతలు,స్క్రాచ్ లని మీరే తొలగించుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్,ల్యాప్ టాప్ స్క్రీన్ లపై పడిన గీతలు,స్క్రాచ్ లని మీరే తొలగించుకోవచ్చు.

Author:

ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది,ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ ఏదైనా ఒక్క చిన్న గీత పడితే మనం తట్టుకోలెం, వెంటనే కొత్త స్క్రీన్ వేసి, స్క్రీన్ గార్డ్ కూడా వేయిస్తం,కాని కొత్త స్క్రీన్ వేయించాలంటే 500 నుండి 5000 వరకు వదులుకోవాల్సిందే, కాని ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాతో మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై ఉండే గీతలని చాలా సులభంగా స్వయంగా మీరే తుడిపెయొచ్చు. స్క్రీన్ ని క్లీన్ చేయడం కోసం ఇంట్లో ఉండే వస్తువులనే వాడవచ్చు, అది ఎలాగో నేర్చుకొని మీ స్మార్ట్ ఫోన్ ని మీరే క్లీన్ చేసుకోండి.

mobile-screen-scratches-with-tooth-paste

మనం ప్రతిరోజు పళ్ళు తోముకోవడానికి వాడే టూత్ పేస్టుతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై పడిన గీతాలను సుల‌భంగా తొల‌గించ‌వ‌చ్చు, మొదటగా ఒక మెత్తటి కాటన్ క్లాత్ ని తీసుకొని, దానిపై కొంచెం టూత్ పేస్టుని రాయాలి, ఆ తరువాత ఆ క్లాత్ సహాయంతో టూత్ పేస్టు ని స్మార్ట్ ఫోన్ స్క్రీన్ అంతటా అంటే విధంగా పూయాలి, అలా పూసిన కొద్ది నిమిషాల తరువాత మరొక కాటన్ క్లాత్ సహాయంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ని శుభ్రం చేయాలి, ఇలా చేస్తే స్క్రీన్ పై పడిన గీతాలు పోతాయి.

mobile-screen-scratches-with-baking-soda

మనం వంటలలో వాడే బేకింగ్ సోడాని ఉపయోగించి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై పడిన గీతలని తొలగించవచ్చు, కొంచెం బేకింగ్ సోడాని ఒక చిన్న బౌల్ లో తీసుకోని దానికి కొంచెం నీటిని కలపాలి, ఈ మిశ్రమాన్ని పేస్టు లాగా తయారుచెయ్యాలి, ఆ తరువాత ఒక కాటన్ క్లాత్ సహాయంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై బేకింగ్ సోడా పేస్టుని అంటించాలి, ఆ తరువాత మరొక క్లాత్ తో స్క్రీన్ ని క్లీన్ చెయ్యాలి.

*ఈ విధానం తో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ తో పాటు, ల్యాప్ టాప్, కంప్యూటర్ స్క్రీన్ ల పై పడిన గీతలని కూడా చాలా సులభంగా తొలగించవచ్చు.

Must Read: స్మార్ట్ ఫోన్ పోతే గూగుల్ మ్యాప్స్ సహాయంతో కనిపెట్టవచ్చు.

(Visited 11,100 times, 1 visits today)