Home / Entertainment / ‘తిత్లీ’ బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం

‘తిత్లీ’ బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం

Author:

తిత్లీ తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని 1,39,844 హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని, మత్స్య శాఖకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే 80 చెరువులు దెబ్బతిన్నాయని, 87 పశువులు మృతి చెందినట్లు చెప్పారు. శ్రీకాకుళంలో 15 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

తిత్లీ తుపానుతో అల్లకల్లోకమైపోయిన ఉత్తరాంధ్రకు

NTR-kalayanram-vijay-devarakonda-sampoornesh-babu--donation-CycloneTitli-to-Apcmrelief-fund

సంపూర్ణేష్ బాబు

తెలుగు వారికి సహాయం చేయడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రియాక్ట్

“శ్రీకాకుళం జిల్లా #CycloneTitli వల్ల చాలా నష్టం జరిగింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను…..వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నాను.నా వంతుగా Rs.50,000/- ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి సహాయనిధి కి అందజేస్తాను” అని సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశాడు.

సినిమా హీరో విజయ్ దేవరకొండ

మరోసారి తన ఉదారత్వాన్ని, మానవతను చాటుకున్నాడు. తిత్లీ తుఫానుతో విలవిల్లాడిన ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు తుఫాను సాయాన్ని అందించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు తన బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ , ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విజయ్ దేవరకొండ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఏపీకి అండగా నిలబడదాం అంటూ పిలుపునిచ్చాడు.

“కేరళకు మనం అండగా ఉన్నాం. నేను కోరడంతో.. నా అభిమానులు కూడా కేరళకు వరద సాయాన్ని అందించారు. కానీ ఈసారి మనకే ఆపద వచ్చింది. మనం కూడా వారి బాధలో పాలుపంచుకుందాం. వారిని ఆదుకుందాం. ప్రతి ఒక్కరి సాయం కూడా చిన్నదేం కాదు” అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. నేను ఆంధ్రప్రదేశ్ వెంట ఉన్నాను. నా ప్రజల కోసం ఎంతో చేయాలన్న ఉద్దేశంతో ఉన్నానని అన్నాడు.

అనిల్ రావిపూడి

విజయ్ దేవరకొండ ట్వీట్‌పై రియాక్ట్ అవుతూ దర్శకుడు అనిల్ రావిపూడి నేను కూడా ఇందులో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

సాయం చేసి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. తుపాను బాధితుల కోసం తారక్‌ రూ.15లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.5 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు ట్విటర్‌ ద్వారా వెల్లడించాయి.

ఈ  స్టార్లపై ప్రశంసల వెల్లువ తిత్లి తుఫాన్ నేపథ్యంలో…. తెలుగు వారికి సహాయం చేయడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రియాక్ట్ అవ్వడంతో పాటు విరాళం అందించిన ఈ  స్టార్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

(Visited 1 times, 1 visits today)