Home / Reviews / మూవీ రివ్యూ: ఎన్టీఆర్ – మ‌హానాయ‌కుడు

మూవీ రివ్యూ: ఎన్టీఆర్ – మ‌హానాయ‌కుడు

Author:

ఎన్టీఆర్ క‌థ‌ని చెప్ప‌డ‌మంటే మాట‌లా? క‌థానాయ‌కుడిగా ఆయ‌న ఎక్కిన శిఖ‌రాలు చూపించాలి. రాజ‌కీయ నేత‌గా ఆయ‌న చేసిన విజ‌య‌యాత్ర‌ని తెర‌పైకి ఎక్కించాలి. అదో సుదీర్ఘ ప్ర‌యాణం.. మ‌హా సంగ్రామం. అందుకే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాల‌ని సంక‌ల్పించారు బాల‌కృష్ణ – క్రిష్‌. క‌థానాయ‌కుడు ఈ సంక్రాంతికి విడుద‌లైంది. ఇప్పుడు ‘మ‌హా నాయ‌కుడు’ వంతు వ‌చ్చింది. క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజ‌యాల‌కు తొలి భాగం ప‌ట్టం క‌డితే.. మ‌హా నాయ‌కుడిగా ఆయ‌న సాగించిన జైత్ర యాత్ర‌కు ‘మ‌హానాయ‌కుడు’ ప‌ట్టం క‌ట్టింది. మ‌రి ఆ ఘ‌ట్టాన్ని క్రిష్ ఎంత స‌మ‌ర్థంగా తెర‌కెక్కించాడు? నంద‌మూరి తార‌క రామారావుగా బాల‌కృష్ణ ఏ స్థాయిలో రాణించాడు? చంద్రబాబు పాత్రలో రానా ఏవిధంగా ఆకట్టుకున్నారు? ‘మహానాయకుడు’తో ఎన్టీఆర్‌ జీవితం సంపూర్ణంగా ఆవిష్కృతమైందా?

కథ:

మొదటి భాగంలో చూపించని ఎన్టీఆర్‌ బాల్యం, బసవ తారకంతో వివాహాన్ని చూపిస్తూ.. మళ్లీ కథానాయకుడు సినిమాను గుర్తు చేస్తూ.. తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే చోట మొదటి భాగాన్ని ముగించగా అక్కడి నుంచే మహానాయకుడు మొదలవుతుంది.తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందిస్తూ.. రెండో భాగం ప్రారంభం కాగా.. తన రాజకీయ ప్రచారం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. నాదెండ్ల భాస్కర్‌ రావు ఘటనతో ఫస్ట్‌ హాఫ్‌ను ముగించగా.. ఎన్టీఆర్‌ ఢిల్లీ వెళ్లడం.. రాష్ట్రపతిని కలవడం.. మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం.. ఇక చివరగా బసవ తారకం మరణించడంతో.. సినిమాను ముగించేశారు.

ntr-mahanayakudu-telugu-movie-review-rating

అలజడి విశ్లేషణ:

ఇది ఎన్టీఆర్ క‌థ అనేది ప‌క్క‌న పెట్టి చూస్తే… ఓ ర‌స‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయ చిత్రంగా ‘మ‌హానాయ‌కుడు’ని అభివ‌ర్ణించ‌వ‌చ్చు. ఓ క‌థానాయ‌కుడు పార్టీని స్థాపించ‌డం, ఆ మ‌రుస‌టి ఎన్నిక‌ల‌లోనే త‌న పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం, పైగా కేంద్రంలోని నిరంకుశ‌త్వ ధోర‌ణికి ఎదురొడ్డి పోరాటం చేయ‌డం ఇవ‌న్నీ అబ్బుర‌ప‌రుస్తాయి. నిజానికి ఇదంతా జ‌రుగుతుందా? సినిమా న‌టుల‌కు అంత శ‌క్తి ఉందా? అనిపిస్తుంది. కానీ ఇది చ‌రిత్ర‌. జ‌రిగిన వాస్త‌వం. కాబ‌ట్టి – ఆ ఉదంతాలు ఎన్టీఆర్‌లోని ప్ర‌బ‌ల‌మైన శ‌క్తిని ప్రతిఫలిస్తాయి.

ధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌కి చాలా ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుని త‌గ్గించ‌డంతో ఆయ‌న విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ ఉదంతాన్ని కూడా తెర‌పై చూపించ‌గ‌లిగారు. ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకోవాల్సివ‌చ్చింది? చేసిన పొర‌పాటుని గ్ర‌హించి మ‌ళ్లీ ఎందుకు వెన‌క‌డుగు వేయాల్సివ‌చ్చింది? అనేదానికీ ఈ సినిమాలో స‌మాధానాలు ఉన్నాయి. నాదెండ్ల భాస్క‌రరావు న‌మ్మించి ఎలా మోసం చేశారు? అధికార దాహంతో ఎన్టీఆర్‌ని సీఎం కుర్చీ నుంచి ఎలా దింపాల‌ని చూశారు? అనేది అస‌లు క‌థ‌. ఆ కుట్ర‌లు, కుతంత్రాల నేప‌థ్యంలో ద్వితీయార్ధాన్ని ఆస‌క్తిదాయ‌కంగా మ‌లిచాడు క్రిష్‌. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్ర‌బాబు తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరారు? దానికి గ‌ల కార‌ణాలేంటి? నాదెండ్ల భాస్క‌ర‌రావు ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌కి ఎదురైన అవ‌మానాలు, ఎం.ఎల్.ఏల‌ను దిల్లీకి తీసుకెళ్లి బ‌ల‌నిరూప‌ణ చేయ‌డం, ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాల‌పై పోరాటం చేయ‌డం.. ఈ స‌న్నివేశాల‌న్నీ ర‌క్తిక‌ట్టిస్తాయి. ఈ సినిమా మొత్తం బ‌స‌వ‌తార‌కం కోణంలో సాగుతుంది. ఆమె మ‌ర‌ణమే.. ఎన్టీఆర్ క‌థ‌కు తుది అంకం.

నటీనటుల

తొలిభాగంలోనే ఎన్టీఆర్‌గా నటించిన బాలయ్యపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ సారి పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగగా.. బాలయ్య వయసుకు తగ్గ పాత్ర కావడంతో.. ‘ఎన్టీఆర్‌’లా బాగానే నటించాడు. మరీ ఎన్టీఆర్‌ను మరిపించేంతగా కాకపోయినా.. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను అవమానపరిచే సన్నివేశాల్లో బాలయ్య తన నటనతో మెప్పించాడు. (సాక్షి రివ్యూస్‌) ఇక బాలయ్య తరువాత చెప్పుకోవాల్సిన పాత్ర విద్యాబాలన్‌దే అవుతుంది. బసవతారకం పాత్రలో ఆమె నటించిన తీరు కథానాయకుడు సినిమాలో చూసేశాం. మహానాయకుడులో కూడా బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ మరోసారి మెప్పించారు. ఇక వీరిద్దరిని మినహాయిస్తే.. చంద్రబాబు పాత్రలో రానా, నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో సచిన్‌ కేద్కర్‌లు ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • బాల‌కృష్ణ – విద్యాబాల‌న్‌
  • భావోద్వేగాలు
  • సంగీతం

మైనస్ పాయింట్స్ :

  • సెకండాఫ్‌ సాగదీత
  • ఎన్టీఆర్ చివ‌రి మ‌జిలీని విస్మ‌రించ‌డం

పంచ్ లైన్:  ‘‘మ‌హానాయ‌కుడు’ కుటుంబ..బాలయ్యకు నచ్చినట్లు.. చంద్రబాబు మెచ్చేట్లు!

రేటింగ్ :  2.75/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘ఎన్టీఆర్ – మ‌హానాయ‌కుడు’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)