Home / General / ఎలుకలని పట్టడానికి రూ.60 లక్షలు ఖర్చుచేశారు…!

ఎలుకలని పట్టడానికి రూ.60 లక్షలు ఖర్చుచేశారు…!

Author:

మనఇంట్లోకి ఎలుక వస్తే ఏం చేస్తాం.. ఎలాగోలా కష్టపడి ఆ ఎలుకని బయటకి పంపడమో లేదా మళ్ళీ రాకుండా చంపడమో చేస్తాం.., ఎలుకల బెడద మరి ఎక్కువగా ఉంటే రెండు మూడు వందలు ఖర్చు పెట్టి ఎలుకలని ఎలాగైనా తరిమేస్తాం, ఇలా మన ఇళ్లల్లో ఎలుకలు చేరినట్టుగానే కర్నూలులోని ప్రభుత్వ దవాఖానలో దాదాపు 300 ఎలుకలు చేరి నానా హంగామా చేస్తున్నాయి, ఆ ఎలుకల బెడద నుండి తప్పించుకోవడానికి అక్కడి అధికారులు ఎంత ఖర్చుపెట్టారో తెలుసా..? అక్షరాలా అరవై లక్షలు..! కేవలం 300 ఎలుకలు పట్టడానికి రూ. 60 లక్షలు అంటే ఒక్కో ఎలుక పెట్టినందుకు 20 వేలు, ఊర్లలో ఎలుకలని పట్టేవాళ్ళని పిలిచి వారం రోజులు భోజనాలు పెట్టి, తలో 1000 రూపాయలు ఇచ్చిన ఇంకా ఎక్కువ ఎలుకలు పట్టేవాళ్ళు కదా అని అక్కడి జనం ఆశ్ఛర్యపోతున్నారు.

60 laksha spent to catch 300 rats

ఎలుకలని పట్టడానికి రూ.60 లక్షల టెండర్ వేశారంటే అక్కడి అధికారులలో అవినీతి ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు, సదరు కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రికి చాలా దగ్గరివాడు కావడం వల్ల అక్కడి అధికారులు కూడా ఎదురుమాట్లాడలేకపోయారు, అసలే కొత్తరాష్ట్రం ఒకవైపు ఆదాయం లేక రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంటే మరోవైపు ప్రజల సొమ్ముని పందికొక్కుల్లా మేస్తున్నారు, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ చేస్తుందో లేదో చూద్దాం..!

(Visited 254 times, 1 visits today)