Home / Entertainment / ఒక మనసు సినిమా రివ్యూ & రేటింగ్.

ఒక మనసు సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Oka-Manasu-Review-Rating ఒక మనసు రివ్యూ

తారాగణం : నాగశౌర్య, నిహారిక, రావూ రమేష్, ప్రగతి
దర్శకత్వం : రామరాజు
సంగీతం : సునీల్ కశ్యప్
నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి

కొణిదెల నిహారిక మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మొట్టమొదటి హీరోయిన్. ఫస్ట్ బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత ముద్దపప్పు ఆవకాయ్ అనే యూట్యూబ్ సిరీస్ తో తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఎలాగైనా సినిమాలకి రావాలనే కోరికతో మెగా ఫ్యామిలీని ఒప్పించి రామరాజు దర్శకత్వంలో ‘ఒక మనసు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య నటించాడు. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయింది, ఎలా ఉందో చూద్దాం…!

కథ:

సూర్య(నాగ శౌర్య)ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, తన తండ్రి(రావు రమేష్) కోసం ఎలాగైనా కార్పోరేటర్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. కార్పోరేటర్ పదవే లక్ష్యంగా రాజకీయాలలో తిరుగుతున్న సమయంలోనే సూర్య, సంధ్య(నిహారిక)ల మధ్య ప్రేమ చిగురిస్తుంది.

సూర్య రాజకీయ నాయకుడిగా అవ్వడం సంధ్యకి ఇష్టం ఉండదు. కానీ, సూర్య కార్పోరేటర్ పదవే తన గోల్ అని సంధ్యతో గొడవలు పడడం, తరువాత సర్దుకుపోవడం జరుగుతుంది, ఒక రోజు సూర్య అరెస్ట్ అయి జైల్ కి వెళ్తాడు. సూర్య ఎందుకు జైల్ కి వెళ్ళాడు..? ఎలా బయట పడ్డాడు..? నిహారికకి ఏమైంది..? అన్నదే మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

ఒక మనసు ఒక మంచి ప్రేమకథతో వచ్చిన సినిమా, ఈ మధ్య వస్తున్న అన్ని సినిమాల కంటే డిఫరెంట్ గా ఉంది. కానీ, సినిమా మొత్తం చాలా నెమ్మదిగా సాగిపోయింది. 90 శాతం సినిమా నిహారిక, నాగశౌర్య ల మధ్యనే ఉంటుంది. సినిమా మొత్తం వైజాగ్, అరకు ప్రాంతాలలోని అందమైన లొకేషన్ లలో సాగుతుంది. ఫస్ట్ఆఫ్ మొత్తం చాలా నెమ్మదిగా సాగిపోవడంతో ప్రేక్షకులు చాలా బోర్ గా ఫీల్ అవుతారు. కామెడీ ఏమాత్రం లేకపోవడం అనేది సినిమాకి చాలా పెద్ద మైనస్ పాయింట్.

ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ ఆఫ్ కొంచెం పర్వాలేదు, సెకండ్ ఆఫ్ లోనే సినిమా కీలక మలుపులు తీసుకుంటుంది. ఎలాగైనా కార్పోరేటర్ అవ్వాలనే ప్రయత్నంలో నాగశౌర్య తప్పులు చేసి జైలుకి వెళ్తాడు. ఈ సమయంలో నాగశౌర్య, రావు రమేష్ ల మధ్యలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. చివరలో నిహారిక తీసుకునే ఒక ఎమోషనల్ నిర్ణయంతో సినిమా పూర్తి అవుతుంది.

నటీనటుల ప్రతిభ:

నాగశౌర్య: రాజకీయ నాయకుడిగా ఎదిగే యువకుడిగాను, ఒక ప్రేమికుడిగాను నాగశౌర్య సూపర్బ్ గా నటించాడు.

నిహారిక: ఇది మొదటి సినిమానే అయిన నిహారిక అద్భుతంగా నటించింది, కానీ కొన్ని ఎమోషనల్ సీన్లలో ఇంకా బాగా నటించాలి. సంధ్య పాత్రలో అచ్చమైన తెలుగు అమ్మాయిగా ఒదిగిపోయింది.

రావు రమేష్: కొడుకు కోసం ఏమైనా చేసే పాత్రలో రావు రమేష్ అదరగొట్టాడు, తన డైలాగ్స్, నటనతో మరోసారి మెప్పించాడు.

ఇంకా సినిమాలో నటించిన వాళ్లలో ప్రగతి చాలా బాగా చేసింది, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ లు అంతగా మెప్పించలేదు.

సాంకేతిక వర్గం పనితీరు:

డైరెక్టర్ రామరాజు తీసుకున్న స్టోరీ బాగున్నప్పటికీ సినిమా మొత్తం చాలా నెమ్మదిగా సాగిపోయింది. అచ్చమైన తెలుగు అమ్మాయిగా నిహారికని, రాజకీయాలలో ఎదగాలనుకుంటున్న యువకుడిగా నాగశౌర్యని, మరియు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని చాలా బాగా తెరకెక్కించాడు. కానీ, స్క్రీన్ ప్లే విషయంలో ఫెయిల్ అయ్యాడు.

సినిమాలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి, పాటలని చూపించిన విధానం సూపర్బ్ గా ఉంది, నిహారిక, నాగ శౌర్య ల మధ్య కెమిస్ట్రీ ని చాలా బాగా చూపించారు, ఎడిటింగ్ అస్సలు బాగాలేదు, మొత్త్తం సినిమాకి ఎడిటింగ్ మైనస్ పాయింట్ గా నిలిచింది.

ప్లస్ పాయింట్స్:

  • నాగ శౌర్య, నిహారిక
  • స్టోరీ
  • మ్యూజిక్
  • క్లైమ్యాక్స్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • కామెడీ లేకపోవటం
  • డైలాగ్స్

అలజడి రేటింగ్: 2.25/5

పంచ్ లైన్చాలా నెమ్మదిగా సా….గిపోయిన ఒక మనసు.

Click to Watch Muddapappu Avakai Videos.

(Visited 6,696 times, 1 visits today)