మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమా ఒక మనసు. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న విష్యం మనకు తెలిసిందే. ఈ సినిమాకి ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ ఫేమ్ రామరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మధుర శ్రీధర్ మరియు టీవి9 సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ దాదాపు పూర్తి కావడంతో వేసవికి విడుదల కానుంది. మనసును తట్టే అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది.స్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడుగా సాగుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని శీవరాత్రి సందర్బంగా ఈ సినిమా పొడ్యూసర్ అయిన మధుర శ్రీధర్ విడుదల చేశారు. పోస్టార్ చూస్తుంటే మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీలా కనబడుతుంది.