Home / Latest Alajadi / ప్రతి టిక్కెట్ పై ఒక రూపాయి రైతుకే, అన్నదాతకు అండగా తమిళ సినిమా.

ప్రతి టిక్కెట్ పై ఒక రూపాయి రైతుకే, అన్నదాతకు అండగా తమిళ సినిమా.

Author:

మన దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారిన దేశానికి అన్నం పెట్టె రైతు పరిస్థితి మాత్రం మారదు, ఎన్నికల సమయంలో రైతులకి అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటించే రాజకీయ నాయకులూ ఆతరువాత పట్టించుకోరు, ప్రతిరోజూ మనం తినే ఆహారాన్ని పండించిన రైతు కష్టాలలో ఉన్నాడని తెలిసి కూడా మనం పట్టించుకో కానీ తమిళ సినిమా ఇండస్ట్రీ రైతుల కష్టాలపై చలించింది, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలని ఆదుకుంటామని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు , హీరో విశాల్ ప్రకటించాడు.

Vishal-About-Farmers

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఒక కీలక నిర్ణయం ప్రకటించాడు, ఇక పై నుండి ప్రతి సినిమా టికెట్ పై ఒక్క రూపాయిని రైతులకి నిర్మాతల మండలి తరుపున ఇవ్వనున్నట్లు తెలిపాడు, రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది నూతనంగా ఎంపికైన నిర్మాతల సంఘం నూతన కార్యవర్గం. సినిమా టిక్కెట్‌ ధరలో నిర్మాతల వంతుగా ఒక రూపాయి రైతులకు అందించనుంది. అంటే తమిళనాడులో ప్రదర్శితమయ్యే అన్ని సినిమాలకు ఏదో ఒకరోజు ప్రతి టిక్కెట్‌పై ఒక రూపాయిని రైతు నిధికి కేటాయిస్తారు. ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని, తద్వారా ఎన్ని కోట్లు వచ్చినా అంతా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకి ఇస్తామని తెలిపాడు విశాల్‌. ఇంతకుముందే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న తమిళ నాడు రైతుల పక్షాన విశాల్ , ప్రకాష్ రాజ్ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి వినతి పత్రం కూడా ఇచ్చారు.

(Visited 587 times, 1 visits today)