Home / Political / శశికళ మాకొద్దు, కావాలంటే ఎలక్షన్లు పెట్టుకోమంటున్న తమిళ యువత.

శశికళ మాకొద్దు, కావాలంటే ఎలక్షన్లు పెట్టుకోమంటున్న తమిళ యువత.

Author:

తమిళ రాజకీయాలతో అక్కడి యవతకు చిర్రెత్తుకొచ్చింది. జయలలిత మరణించిన తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకొని ఎటువంటి రాజకీయ అనుభవం లేని శశికళను ముఖ్యమంత్రి ని చేసేదాక వచ్చి ఆగాయి. అమ్మ మరణం తరువాత తమిళనాడు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది, ఆ సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వం అసలు పనులు ప్రక్కకుపెట్టి శశికళను ముఖ్యమంత్రిగా చేయాలనుకోవడంపై తమిళ యువత సోషల్ మీడియాలొ భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఛేంజ్.ఆర్గ్ వెబ్ సైట్ లో Tamil Arasan PSR అనే వ్యక్తి తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసి శశికళ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోండి అంటూ రాష్ట్రపతి కి చేరేలా ఒక ఆన్ లైన్ పిటీషన్ రాసాడు.

Dissolve TN govt and Stop Sasikala from becoming Tamilnadu CM

అనూహ్యంగా ఈ పిటీషన్ ప్రారంభించిన 15 నిమిషాల్లోపే శశికళకు వ్యతిరేకంగా 19000 మంది సంతకాలు పెట్టారు, ఆ సంఖ్య 24 గంటలలో 80,000 చేరింది. ఇలా సంతకాలు చేస్తున్న వారిలో చాలా మంది శశికళకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని తాము గత ఎన్నికలలో అమ్మకు వోటు వేసామని ఆమే ఇప్పుడు లేదు కాబట్టి మరల ఎన్నికలు జరపాలని రాస్తున్నారు. అంతే కాని దొడ్డి దారిలో చిన్నమ్మ ముఖ్యమంత్రి అయితే సహించేది లేదని తమ అగ్రహాన్ని ఆన్ లైన్ లో తెలుపుతున్నారు. దీనితో చిన్నమ్మపై తమిళ యువతకు ఏమాత్రం నమ్మకం లేదని అర్ధం అవుతుంది. ఈ సంతకాలను రాష్ట్రపతి,గవర్నర్ లకు అందజేస్తామని ఛేంజ్.ఆర్గ్ వెబ్ సైట్ తెలిపింది.

(Visited 408 times, 1 visits today)