Home / Latest Alajadi / ఆ ఊరిలో చలికాలం ఉష్ణోగ్ర‌త -71 డిగ్రీలు ఉంటుంది.

ఆ ఊరిలో చలికాలం ఉష్ణోగ్ర‌త -71 డిగ్రీలు ఉంటుంది.

Author:

మన దగ్గర చలి తీవ్రత పెరుగుతోందని రోజు పేపర్లలోను, టీవీలలోను చెబుతుంటే చూస్తూ ఉంటాం. పగటి ఉష్ణోగ్ర‌త 10 డిగ్రీలు ఉంటేనే దుప్పటి నుండి బయటకు రాలేని పరిస్థితి అయితే ఒక ఊరిలో ఉష్ణోగ్ర‌త -71 డిగ్రీలు ఉంటే వారి పరిస్థితి ఎంటో ఒకసారి ఊహించుకోండి. అసలు అంతా చలిలో మనషులు బ్రతుకతారా అనేగా మీ సందేహం? ఐతే రష్యా దేశం లోని ఓయంయాకోన్ (Oymyakon) అనే ఊరి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఆ ఊరిలోనే పైన చెప్పిన -71.2 డిగ్రీల ఉష్ణోగ్ర‌త నమోదయ్యింది. “పోల్ ఆఫ్ కోల్డ్” అని పేరు గడించిన ఆ ఊరిలో చలికాలం సగటు ఉష్ణోగ్ర‌త -50 డిగ్రీలు ఉంటుందట.. అంత చలిలో కూడా ఆ ఊరిలో 500 మంది నివాసం ఉంటున్నారు. మరి అంత చలిలో వారు ఎలా బ్రతకగలుగుతున్నారో క్రింద చదవండి.

Worlds Coldest Place Oymyakon

చలికాలంలో ఆ ఊరిలో పగలు కేవలం 3 గంటలు మాత్రమే ఉంటుంది మిగిలిన 21 గంటలు చీకటే, అక్కడ నివసించే వారికి చేపలు పట్టడం, వేటాడటం, పశుపోషణ ప్రధాన వృత్తులు. అంత చలిలో మొక్కలు పెరగని కారణంగా వారికి స్థానికంగా దొరికే దుప్పులు, గుర్రాల మాంసం, ఆవు పాలు, పెరుగు వారికి ఆహారం. అయితే నిత్యం మాంసం తిన్నా వారిలో పౌష్టికాహార లోపం ఉండదు. ఆ ఊరికి క‌రెంటు, వేడి గాలిని అందించేందుకు బొగ్గు, క‌ల‌ప‌ ను మండించే ఓ ప‌వ‌ర్ స్టేషన్ ప‌ని చేస్తుంది. అక్కడ కార్లను కూడా వేదిగా ఉండే గ్యారేజ్లో ఉంచుతారు, బయటకు వెలితే అసలు ఇంజన్ ఆఫ్ చేయరు ఎందుకంటే అంత చలిలో కారు బ్యాటరీలు పని చేయవు. ఇంక ఆ ఊరిలో ఎవరైనా చనిపోతె వారిని పూడ్చిపెడతారు కాని శ‌వం కోసం గొయ్యి త‌వ్వేందుకు మాత్రం వారికి 3 రోజుల స‌మయం ప‌డుతుంది. ముందుగా మంచుపై రెండు రోజుల పాటు మంట పెట్టి ఆ తర్వాత మంచు క‌రిగాకా గుంత త‌వ్వుతారు. ఒంటి మీదా బట్టలు లేకుండా అంత చలిలో బయటకు వెలితే ఒకటే నిముషంలో ఒళ్ళు గడ్డకట్టి చనిపోతారట. ఇవి ఆ ఊరి విశేషాలు మీరు అంత చలిని ఆస్వాదించాలనుకుంటే ఒకసారి వెళ్ళిరండి.

(Visited 739 times, 1 visits today)