Home / Reviews / మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు

మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు

Author:

శర్వానంద్-సాయి పల్లవి లాంటి చక్కటి జంట.. హను రాఘవపూడి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు.. ఈ కాంబినేషన్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పడి పడి లేచె మనసు’. ఈ రోజే మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

సూర్య (శ‌ర్వానంద్‌) ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. తొలి చూపులోనే వైద్య విద్యార్థిని అయిన వైశాలి (సాయిప‌ల్ల‌వి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. సూర్య ప్రేమ‌లో నిజాయ‌తీని గ‌మ‌నించిన వైశాలి కూడా అత‌న్ని ప్రేమిస్తుంది. ఇంత‌లో వైశాలి మెడిక‌ల్ క్యాంప్ కోస‌మ‌ని నేపాల్ వెళుతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ‌తాడు సూర్య‌. వైశాలి పెళ్లి ప్రస్తావ‌న తెస్తుంది. పెళ్లి అంటే రాజీప‌డి బ‌త‌క‌డ‌మని… పెళ్లి కాకుండా ప్రేమ‌లో మాత్ర‌మే సంతోషంగా ఉంటామ‌ని సూర్య చెబుతాడు. క‌లిసుండ‌క‌పోతే చ‌చ్చిపోతామ‌నుకున్న‌ప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని, ఏడాది త‌ర్వాత కూడా ఇద్ద‌రికీ అలా అనిపించిన‌ప్పుడు, ఇక్క‌డే పెళ్లి చేసుకుందామ‌ని చెబుతాడు. సూర్య అలా చెప్ప‌డానికి కార‌ణ‌మేమిటి? అప్పుడు విడిపోయిన ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ  క‌లిశారా? వైశాలి కోసం ఏడాది త‌ర్వాత నేపాల్ వెళ్లిన సూర్య‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

సినిమా కథ నేపాల్‌లో ప్రారంభమవుతుంది. తను ప్రేమించిన అమ్మాయికి  దూరమైన సూర్య(శర్వానంద్‌) తన ప్రేమకథను చెప్పటం ప్రారంభిస్తాడు. కొల్‌కతాలో వైశాలి (సాయి పల్లవి) అనే మెడికల్ స్టూడెంట్తో ప్రేమలో పడ్డ సూర్య, ఆమె వెంటపడుతుంటాడు. వైశాలి కూడా సూర్యని ఇష్టపడుతుంది. కానీ తన గతం కారణంగా కలిసుందాం గాని పెళ్లి వద్దని సూర్య అంటాడు. దీంతో ఇద్దరు విడిపోతారు సూర్య, వైశాలీలు తిరిగి ఎలా కలిశారు. ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ అన్నదే మిగతా కథ.

padi-padi-leche-manasu-movie-review-and-rating

నటీనటుల

శర్వానంద్‌ మరోసారి తనదైన మెచ‍్యూర్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్‌, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి కూడా తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో పర్ఫామ్‌ చేసింది. వైశాలి పాత్రలో జీవించింది. శర్వా, సాయి పల్లవిల నటన సినిమా స్థాయిని పెంచింది. ఇద్దరు నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరగటంతో ఇతర పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఉన్నంతలో ప్రియదర్శి, సునీల్‌, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్‌ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్ :

  • శ‌ర్వా, సాయిప‌ల్ల‌విల న‌ట‌న క‌థా నేప‌థ్యం
  • క‌థా నేప‌థ్యం
  • మ్యూజిక్‌

మైనస్ పాయింట్స్ :

  • సెకండ్‌ హాఫ్‌లో బోరింగ్‌ సీన్స్‌

పంచ్ లైన్:  ‘పడి పడి లేచె మనసు’.. లేచి పడిన సినిమా

రేటింగ్ :  3/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘పడి పడి లేచె మనసు ’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)