Home / Entertainment / పద్మవత్ సినిమా రివ్యూ & రేటింగ్.

పద్మవత్ సినిమా రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

3.5/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: దీపికా ప‌దుకొణె.. షాహిద్ క‌పూర్‌.. ర‌ణ్‌వీర్ సింగ్ త‌దిత‌రులు

Directed by: సంజ‌య్ లీలా భ‌న్సాలి

Produced by: అజిత్, సంజయ్ లీలా భన్సాలీ

Banner: భ‌న్సాలీ పిక్చ‌ర్స్‌.. వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌

Music Composed by: సంచిత్ బ‌ల్హారా

సంవత్సర కాలం నుండి పద్మావతి సినిమా గురించిన వివాదం నడుస్తూనే ఉంది, డిసెంబరు 1నే రావాల్సిన ఈ చిత్రం ఈ వివాదాల వల్లే ఆలస్యమైంది. చివరికి వివాదాలన్నింటినీ దాటుకుని.. సెన్సార్ బోర్డు అడ్డంకుల్ని కూడా అధిగమించి.. ‘పద్మావత్’గా పేరు మార్చుకుని ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి.

కథ:

ఖిల్జీ వంశానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ కుట్రలతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టిస్తాడు, తనకి కావాల్సిన వాటికోసం ఎంతటి దుర్మార్గమైన చేస్తాడు, రాజపుత్ వంశానికి చెందిన మహారాణి ” పద్మావతి” సౌందర్యం గురుంచి తెలుసుకొని ఎలాగైనా ఆమెని పొందాలనుకుంటాడు, కొన్ని కుట్రలని రచించి రాజ్ పుత్ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు, మరి రాజ్ పుత్ రాజు అల్లాఉద్దీన్ ఖిల్జీని ఎలా ఎదుర్కున్నాడు..? ఖిల్జీ రాణి పద్మావతిని పొందడా..? లేదంటే ప‌ద్మావ‌తి వీర‌త్వం ముందు త‌లవంచాడా? చివరికి ఏం జరిగింది అనేది తెరమీద చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

ప్రేమ కథని మూలకథగా తీసుకోని వాటికి ఎమోషనల్ డ్రామాని కలిపి కమర్షియల్ ట్రీట్ మెంట్ చేసి రక్తి కట్టించడంలో సంజయ్ లీల భన్సాలీది అందవేసిన చెయ్యి, ఇలా ఇప్పటికి అనేక సినిమాలు అద్భుతంగా తెరకెక్కించాడు, రాజపుత్ వంశానికి చెందిన వీరనారి మహారాణి పద్మావతి కథని కూడా తనదైన స్టైల్ లో వెండి తెర‌పై ఆవిష్క‌రించాడు భ‌న్సాలీ. సాధార‌ణంగా రాజ్‌పుత్‌ క‌థ‌, యుద్దాలు అంటే… ఎక్కువ‌గా యాక్ష‌న్ సీన్స్, క‌త్తి యుద్దాలు, గుర్ర‌పు స్వారీలు, ఎత్తుగ‌డ‌లు, యుద్ధ నైపుణ్యాలు ఉంటాయని ఊహిస్తారు కానీ సంజయ్ లీలా భ‌న్సాలీ యాక్షన్ ఎపిసోడ్స్ కంటే ఎక్కువ పాత్రల మధ్య వీలైనంత డ్రామా ఎలివేట్ చేయ‌డానికి చూశాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ అరాచ‌క‌త్వం, అత‌ని క్రూరమైన ఆలోచ‌న‌లు, సింహాస‌నాన్ని అడ్డ‌దారిలో అందుకున్న విధానం.. వీటితో క‌థ ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది.

ఫస్ట్ ఆఫ్ లో పాత్రల పరిచయం, పాత్రల మధ్య సంబంధాలని ఎక్కువగా చూపి ప్రేక్షకులు కథకి ఈజీగా కనెక్ట్ అయ్యేలా భన్సాలీ తెరకెక్కించారు, సెకండ్ ఆఫ్ లో పాత్రల మధ్య ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఎపిసోడ్ లని చాలా అద్భుతంగా తీశారు, ముఖ్యంగా ఎనిమిది వంద‌లమంది దాసీల‌తో ప‌ద్మావ‌తి ఖిల్జీల‌పైకి దండెత్తే స‌న్నివేశం ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది, క్లైమాక్స్ లో రాజ్ పుత్ ల గురుంచి అద్భుతంగా చూపించారు.

చరిత్రని సినిమాగా తీస్తున్నప్పుడు ప్రేక్షకులు కన్ఫ్యూజన్ కాకుండా కథని చెప్పాలి.. ఈ విషయంలో భన్సాలీ సక్సెస్ అయ్యాడు అనే చెప్పొచ్చు, వివాదాల కారణంగా కొన్ని కొన్ని సన్నివేశాలని మధ్యలోనే కట్ చేసారు, ఇంకా భన్సాలీ సినిమా అంటేనే పాటలు అద్భుతంగా ఉంటాయి కానీ ఈ సినిమాలో పాటలు కొంచెం నిరాశపరిచాయి,అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్సపెక్ట్ చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా నిరాశపరుస్తుంది,  చివరగా మన దేశ చరిత్రలోని ఒక అద్భుతమైన వీరనారి పద్మావతి కథని చూసి థ్రిల్ గా ఫీల్ అవుతారు.

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఈ సినిమాలో అన్ని పాత్రలు అద్భుతంగా వచ్చాయనే చెప్పాలి, ముఖ్యంగా ఖిల్జీగా క్రూరత్వం పండించడంలో రణ్ వీర్ సింగ్ అద్భుతంగా చేసాడు, రాణి పద్మావతిగా దీపికా చేసిన పాత్ర ఆమె కెరీర్ లో అత్యుత్తమ పాత్రగా నిలిచిపోతుంది, రాజ్ పుత్ వీరుడిగా షాహిద్ కపూర్ కూడా అద్భుతంగా చేసాడు.

ప్లస్ పాయింట్స్:

  • కథ, స్క్రీన్ ప్లే
  • రణ్ వీర్ సింగ్, దీపికా ల నటన
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది.
  • కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్

మైనస్ పాయింట్స్ :

  • కొన్ని సీన్స్ మధ్యలోనే జంప్ అవ్వడం.
  • పాటలు.

పంచ్ లైన్: పద్మవత్ ఒక అద్భుతమైన సినిమా.

(Visited 1,686 times, 1 visits today)