Home / Entertainment / పందెం కోడి-2…సినిమా రివ్యూ

పందెం కోడి-2…సినిమా రివ్యూ

Author:

తెలుగువాడైన విశాల్ కు తమిళంలో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ‘సెండైకోళి’. ఆ చిత్రం తెలుగులో ‘పందెంకోడి’ పేరుతో విడుదలై ఇక్కడా విజయం సాధించింది. పుష్కరం తర్వాత ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. లింగుస్వామినే రూపొందించాడు. దసరా కానుకగా మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏమాత్రం అందుకుందో చూద్దాం పదండి.

కథ:

బాలు (విశాల్) కడప జిల్లాలో కొన్ని ఊర్లు దేవుడిగా కొలిచే రాజా రెడ్డి (రాజ్ కిరణ్) కొడుకు. కొన్నాళ్లు ఫ్యాక్షన్ గొడవల్లో తలమునకలై ఉన్న అతను.. తర్వాత విదేశాలకు వెళ్తాడు. మరోవైపు ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు ముదురుతాయి. ఒక గొడవలో తన భర్త ప్రాణాలు కోల్పోయిన భవాని (వరలక్ష్మి).. రాజా రెడ్డి కుటుంబం కాపాడుతున్న ఓ వ్యక్తిని చంపడానికి కంకణం కట్టుకుని కూర్చుంటుంది. ఇలాంటి సమయంలో బాలు తిరిగి సొంత ఊరికి వస్తాడు. కొన్నేళ్లుగా ఆగిన ఊరి జాతరను వైభవంగా జరిపించి.. ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పడానికి రాజారెడ్డి ప్రయత్నిస్తుంటే.. భవాని మనుషులు అడ్డం పడుతుంటారు. వారిని అడ్డుకుని తండ్రి సంకల్పాన్ని బాలు ఎలా నెరవేర్చాడు అన్నది మిగతా కథ.

pandem-kodi-2-movie-review-rating

అలజడి విశ్లేషణ:

రాజా రెడ్డి (రాజ్‌ కిరణ్‌) కడప జిల్లాలోని ఎన్నో గ్రామాలను తన కంటి చూపుతో శాసించే పెద్ద మనిషి. ఏడేళ్ల క్రితం వీరభద్ర స్వామి జాతరలో జరిగిన గొడవలో భవానీ(వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) భర్త హత్యకు గురవుతాడు. తన భర్తను చంపిన వారి కుటుంబంలో అందరినీ చంపేసిన భవానీ మనుషులు రాజా రెడ్డి అడ్డుపడటంతో గోపి అనే కుర్రాన్ని మాత్రం చంపలేకపోతారు. అందుకే ఆ కుర్రాన్ని కూడా జాతరలోనే చంపి పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటుంది భవానీ.

ఏడేళ్లుగా జాతర చేయకపొవటంతో ఊళ్లల్లో కరువు తాండవిస్తుంది. దీంతో ఈ సారి ఎలాగైనా జాతర చేయాలని అన్ని ఊళ్ల పెద్దలను ఒప్పించి జాతర పనులు మొదలు పెడతాడు రాజా రెడ్డి. ఏడేళ్లుగా ఈ గొడవలకు దూరంగా ఉన్న రాజా రెడ్డి కొడుకు.. బాలు(విశాల్) కూడా జాతర కోసం ఊరికి వస్తాడు. జాతర మొదలైన నాలుగో రోజు గోపిని కాపాడే ప్రయత్నాల్లో రాజారెడ్డి గాయపడతాడు.

ఈ విషయం ఊరి ప్రజలకు తెలిస్తే ఒక్కరిని కూడా బతకనివ్వరని భయంతో ఊళ్లో జనాలకు రాజా రెడ్డి మీద దాడి జరిగిన విషయాన్ని చెప్పుకుండా దాచిపెట్టి జాతర ఆగకుండా జాగ్రత్త పడతాడు బాలు. జాతర పూర్తయ్యే వరకు బాలు అసలు విషయం ఊరి ప్రజలకు తెలియకుండా ఆపగలిగాడా..? రాజా రెడ్డి మాట ఇచ్చినట్టుగా బాలు, గోపి ప్రాణాన్ని కాపాడాడా..? అనుకున్నట్టుగా జాతర సజావుగా జరిగిందా..? చివరకు భవానీ కథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.

నటీనటుల పెర్ఫార్మన్స్:

విశాల్ తనకు పర్ఫెక్టుగా సూటయ్యే పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ ఘట్టాల్లో.. ఎలివేషన్ సీన్లలో అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎక్కడా ఓవర్ ద టాప్ అనిపించకుండా.. లింగుస్వామి స్టయిల్లో సింపుల్ గా తన పాత్రను చేసుకెళ్లాడు విశాల్. కీర్తి సురేష్ కూడా బాగా చేసింది. ఆమె కెరీర్లో మరో గుర్తుంచుకోదగ్గ పాత్ర ఇది. ‘పందెంకోడి’లో మీరా లాగే.. కీర్తి కూడా బలమైన ముద్ర వేసింది. ‘మహానటి’ తర్వాత కీర్తికిది మేకోవర్ అని చెప్పొచ్చు. డ్యాన్సుల్లో కీర్తి ఎనర్జీ ఆకట్టుకుంటుంది. హీరో తండ్రిగా కీలకమైన పాత్రలో రాజ్ కిరణ్ కూడా మెప్పించాడు. విలన్ గా వరలక్ష్మి పెర్ఫామెన్స్ బాగుంది. పతాక సన్నివేశంలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులంతా ఓకే.

ప్లస్ పాయింట్స్ :

  • విశాల్ నటన
  • రాజ్ కిరణ్ నటన
  • కీర్తి నటన
  • పోరాట దృశ్యాల జంట

మైనస్ పాయింట్స్ :

  • దర్శకత్వం
  • బోరింగ్ సెకండ్‌ హాఫ్‌

పంచ్ లైన్:  పందెం కోడి-2.. మాస్ కు మాత్రమే.

రేటింగ్ :  2.5/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

(Visited 1 times, 1 visits today)