Home / General / కోడిపుంజులని అరెస్ట్ చేసి లాకప్ లో వేసిన పోలీసులు..!

కోడిపుంజులని అరెస్ట్ చేసి లాకప్ లో వేసిన పోలీసులు..!

Author:

సాధారణంగా ఏదైనా నేరం చేసిన వాళ్ళని తప్పించుకోకుండా పోలీసులు లాకప్‌లలో పెడుతుంటారు. కానీ అదే లాకప్‌లో పోలీసులకు కోడిపుంజులను ఉంచాల్సిన వింత పరిస్థితి విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలంలోని గ్రామాల్లో చోటుచేసుకుంది, సంక్రాంతి పండుగా సందర్భంగా ఈ ప్రాంతంలో జోరుగా జరిగిన కోడిపందేలపై పోలీసులు వరసగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది పందెం కోడి పుంజులతోపాటు ఎనిమిది మంది నిందితులను పట్టుకున్నారు. నిందితులను వ్యక్తిగత పూచీపై విడిచిపెట్టారు. తరువాత పుంజులను, నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.

లాకప్‌లో కోడిపుంజులు

మిగిలిన ప్రాంతాల్లో పట్టుకున్న కోడిపుంజులతో సహా అన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలన్న కోర్టు ఆదేశించింది, నిందితులని అయితే రోజు స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టాలనే షరతుతో వదిలిపెట్టారు, కానీ కోడిపుంజులను అలా వదిలిపెట్టలేక పోలీస్ స్టేషన్ లోనే లాకప్ లో పెట్టారు, స్టేషన్ లో ఉన్న పందెం కోడిపుంజులను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు స్టేషన్ కి వస్తున్నారు.

(Visited 170 times, 1 visits today)