Home / Inspiring Stories / పెద్దనోట్లు తీసుకోని ఆసుపత్రికి 40,000 చిల్లరతో బుద్ది చెప్పిన రోగి.

పెద్దనోట్లు తీసుకోని ఆసుపత్రికి 40,000 చిల్లరతో బుద్ది చెప్పిన రోగి.

Author:

గత మూడు రోజులుగా సామాన్య ప్రజలను, సోషల్ మీడియాను పట్టి పీడిస్తున్న అంశం పాత 500, 1000 రూపయల నోట్ల రద్దు. మోడి ప్రకటన చేసినప్పటినుండి నోట్ల రద్దుపై వందల కొద్ది స్టోరీలు, పోస్టులు వార్త పత్రికలలో, మరియు సోషల్ మీడియా వెబ్ సైట్లలో ప్రచురితం అయ్యాయి. అత్యవసర పరిస్తితులలో ఆసుపత్రులలో పాత నోట్లు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కొన్ని ఆసుపత్రులు ఆ నిభందనను పాటించడంలేదు. అలాంటి ఒక ఆసుపత్రి భలె బుద్ది చెప్పాడు ఒక రోగి. ఆ కదెంటో చదవండి.

patient-settles-rs40000-hospital-bill-in-coins

కలకత్తా కు చెందిన సుకంతొ చౌలె అనే వ్యక్తికి డెంగీ జ్వరం రావడంతో దగ్గరలోని బీపీ పొద్దార్ ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నాడు. చికిత్స పూర్తి అయి డిస్చార్జ్ అవుదామనుకున్న చౌలె కు పెద్ద నోట్ల రద్దు సెగ తగిలింది. ట్రీట్మెంట్ కోసం అయిన బిల్లు 40,000 చెల్లించడానికి వెలితే ఆసుపత్రి వారు కేవలం 100 రూపాయల నోట్లు ఐతేనే తీసుకుంటామని పట్టుపట్టారు. కాని చౌలే దగ్గర కేవలం పెద్ద్ నోట్లు మాత్రమే వున్నాయి, చెక్ ఇస్తామన్నా, కార్డుతో కడతామన్నా ఆసుపత్రి వారు ఒప్పుకోకుండా అన్ని 100 నోట్లే కావాలని అడిగారు. ఎంత బ్రతిమాలినా వినని ఆసుపత్రి వారికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్న చౌలె మరియు అతని బందువులందరు తమ తమ వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఈ సంఘటణను తెలిపి తమ దగ్గర ఉన్న నాణేలను ఆసుపత్రి తీసుకురావాల్సిందిగా పోస్ట్ చేసారు. కొంత సమయంలొనే 40,000 రూపాయలకు సరిపడు చిల్లర జమ చేసారు. ఇక ఆ చిల్లరను ఆసుపత్రి బిల్లు కట్టడానికి వెళ్ళగా ఆసుపత్రి సిబ్బంది చిల్లర తీసుకోవడానికి నిరాకరించారు. దానితో ఆగ్రహించిన బంధువులు పోలీసు కేసు పెట్టడానికి సిద్దమయ్యారు. ఇక చేసేది లేక ఆసుపత్రి వర్గాలు తమ సిబ్బందితో ఆ చిల్లర మొత్తం లెక్కించి చౌలె ను డిస్చార్జ్ చేసారు.

(Visited 4,147 times, 1 visits today)