డైలాగ్ కింగ్ మోహన్ బాబు మరోసారి వెండి తెరపై సందడిచేయనున్నారు. హీరోగా, విలన్ గా, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం
ఏర్పరుచుకున్న మోహన్ బాబు కొన్నేళ్ళుగా నటనకు దూరంగానే ఉన్నారు. కొన్ని పాత్రలకు నిర్మాతలు అడిగినా అన్ని పాత్రలూ చేసి తన పేరు చేడగొట్టుకోలేనంటూ డైరెక్ట్ గానే చెప్పి తిరస్కరించారు ఈ మంచు శిఖరం. ఇప్పటికే హీరోలు గా మారిన ఇద్దరు కొడుకులూ, నటి, నిర్మాతగా ఉన్న మంచు లక్ష్మీ ప్రసన్న అడిగినా తనకు నచ్చని పాత్రలు చేయనని చెప్పేసారట. పూరీ జగన్నాథ్ బుజ్జిగాడూ, రాం గోపాల్ వర్మ రౌడీ లాంటి సినిమాలో తనకు తగిన పాత్రలనే ఎంచుకొని నటించిన మోహన్ బాబు మరోసారి తెరమీదికి రానున్నారు అదీ ఇద్దరు హీరోయిన్లతో..
” మామ మంచు-అళ్ళుడు కంచూ ” సినిమా నిర్మాణం లో ఉన్న సంగతి తెల్సిందే, మోహన్ బాబు తన పాత జోడీలైన రమ్యకృష్ణ, మీనా ల కు ముద్దుల మొగుడిగా కనిపించనున్నరు. ఇంకో విశయమేంటంటే ఒక పాటలో ఈ ఇద్దరు భామలతో ఒక పాటలో స్టెప్పులు కూడా వెయ్య బోతున్నాడట. ఇదివరకే ఇద్దరితోనూ విడివిడిగా హిట్లు కొట్టిన మోహన్ బాబు ఈసారి ఎలాంటి విజయాని ఇస్తాడో చూడాలి. రమ్యకృష్ణకి కొడుకుగా వరుణ్ తేజ్, మీనా కి కూతురుగా పూర్ణా నటిస్తుండగా కంచు అళ్ళుడిగా “అల్లరి”నరేష్ చేస్తున్నాడు.
(Visited 66 times, 1 visits today)