పవన్ గురించి శ్రీకాంత్ సెన్సేషన్ చేయబోతున్నాడు..నిజమే కానీ హీరో శ్రీకాంత్ కాదు. ఈ సంచలనం చేస్తున్న వ్యక్తి పవన్ కల్యాన్ వీరాభిమాని శ్రీకాంత్ ఇతను. ఒకవ్యక్తి జీవితంపై 18 సంవత్సరాల పరిశోధన అంటే అది వినడానికీ ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అటువంటి అద్భుతమే ఈ పవన్ వీరాభిమాని చేయబోతున్నాడు.ఇతడు గత 18 సంవత్సరాలుగా పవన్ వ్యక్తిత్యం మరియు అతడి జీవితం పై చేసిన పరిశోధన పూర్తి కావడంతో అది త్వరలో పుస్తక రూపంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ వీరాభిమానులు ‘పవనిజమ్’ పేరుతో ఒక ఇజాన్ని సృష్టించి వెబ్ మీడియాలో ప్రచారం చేసిన నేపధ్యంలో, ఆ విషయాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తూ శ్రీకాంత్ ఈ పుస్తకాన్ని రాయడమే కాకుండా ఇప్పటివరకు చాలామందికి అర్ధం కాని పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి అద్దం పట్టేలా ఈ పుస్తకంలో సమగ్రమైన వివరణ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.రీసెర్చ్ లో భాగంగా శ్రీకాంత్ పలుసార్లు పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావ్, తల్లి అంజనా దేవి, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబుతో సమావేశమై ఆయన గురించిన వివరాలు తెలుసుకున్నాడట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల పుస్తకాల చదివినట్లు తన పరిశోధనలో వెల్లడి అయిందని ఈ రచయిత చెపుతున్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ ఆలోచనల పై రమణ మహర్షి ప్రభావం ఎంతగా ఉంది అన్న విషయాన్ని ఈ పుస్తకంలో వివరించాడట.ఈ పుస్తక రచన పూర్తి కావడంతో అతిత్వరలో ఈ పుస్తకాన్ని ప్రముఖుల సమక్షంలో విడుదచేసే ఉద్దేశంలో ఉన్నాడట శ్రీకాంత్..