‘ ఔటర్ రింగ్ రోడ్డు కోసం 18 ఎకరాలు సేకరిస్తే మురళీ మోహన్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్లారు ? ఆయనదైతే ఒకటీ ప్రజలదైతే ఒకటీన..?’ అంటూ జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మురళీ మోహన్ స్పందించారు. ‘‘అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నా 18 ఎకరాలు సేకరించారు. అప్పుడు కూడా నేను వ్యతిరేకించలేదు. కానీ… అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ వ్యవహార శైలి, వట్టి వసంతకుమార్ ” మురళీ మోహన్ చంద్రబాబుకు బినామీ ” అంటూ చేసిన వ్యాఖ్యలపై బాధ, కోపంతోనే సుప్రీం కోర్టుకు వెళ్లాను’’ అని ఆయన అన్నారు . వైఎస్ అనుయాయులు కొందరు తన దగ్గరకు వచ్చి, 9 ఎకరాలు తమకు వదిలేస్తే… మిగతా 9 ఎకరాలు రింగ్‌రోడ్డుకు సేకరించకుండా చూస్తామని
తెలిపారన్నారు. దీనికి తాను అంగీకరించలేదన్నారు. చివరికి సుప్రీంకోర్టులో రింగ్ రోడ్డుకు అనుకూలంగా తీర్పు రావడంతో తన 18 ఎకరాలు పోయాయని చెప్పారు. తాను న్యాయబద్ధంగా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అవకతవకలు పట్టుకుందామని ప్రయత్నించారు. కానీ ఎక్కడా తప్పుచేయక పోవటం వల్ల తననేం చేయలేకపోయారనీ ఆయన చెప్పారు. సమీకరణకు సహకరించాలి’’ అని ఆయన సూచించారు.
ఇప్పుడు నవ్యాంద్రకు రాజధాని లేక పోవటం వల్ల భూసేకరణకు సహకరించాలనీ, పవన్ కళ్యాన్ దేశభక్తులైన అల్లూరీ, సుభాష్ చంద్రబోస్ ల స్పూర్తి తో వ్యవహరించాలనీ మురళీ మోహన్ అన్నారు.