సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది.గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా , ఎక్కడ విన్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది , గోపాలా గోపాలా లాంటి హిట్స్ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉగాది పండుగ కంటే ఘనం గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. గత రెండు మూడేళ్లలోనే పవన్ ఇమేజ్ పీక్స్ స్టేజ్‌కు పెరిగిపోవడంతో పాటు 2012 లో వచ్చిన గబ్బర్‌సింగ్ కు కొనసాగింపుగా తెరకెక్కిన సర్దార్‌పై లెక్కకు మించి అంచనాలు ఉన్నాయి..
‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు. కాగా, పవన్ ఫ్యాన్స్ గొడవలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని పావగడలో అలరార్ ధియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో రాజేశ్ అనే యువకుడు మృతి చెందాడు.