Home / Entertainment / పవన్ కళ్యాణ్ కి అరుదైన గౌరవం….!

పవన్ కళ్యాణ్ కి అరుదైన గౌరవం….!

Author:

ఒక హీరోగా, ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ గురుంచి మనకి తెలియంది కాదు, ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు జనసేన పార్టీ నుండి ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు, మాములు రాజకీయనాయకులలాగా ఓట్ల కోసం, పాపులారిటీ కోసం కాకుండా ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా పోరాటాలు సాగిస్తున్నాడు, తన సినిమాలతో, వ్యక్తిత్వంతో ఎంతో ఎత్తుకు ఎదిగిన పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఒక అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ఇండియన్ కాన్ఫరెన్స్ 2017లో ప్రసంగించేందుకు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది.

Pawan Kalyan Jana Sena Party Launch

హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే ఉత్తమమైన యూనివర్సిటీలలో ఒకటి, అలాంటి యూనివర్సిటీలో ప్రసంగించేందుకు పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందింది అంటే అది చాలాగొప్ప విషయం, తాను చదివినది కేవలం ఇంటర్ అయినా.. ప్రజా సమస్యలపై పోరాటం.. ఇటు పవర్ స్టార్ గా ఎదిగిన తీరు.. పవన్ కు ఈ అకాశం కల్పించాయని చెప్పాలి. కేవలం ఇంటర్ చదివిన వ్యక్తికి హార్వర్డ్ లెక్చర్ ఇచ్చే అవకాశం అంటే.. అది ఖచ్చితంగా పవన్ ప్రతిభా పాటవాలకు దక్కిన గౌరవంగా చెప్పాలి.

(Visited 493 times, 1 visits today)