Home / Entertainment / విద్యార్ధిని కాలేజీ ఫీజు కట్టిన పవన్ కళ్యాణ్.

విద్యార్ధిని కాలేజీ ఫీజు కట్టిన పవన్ కళ్యాణ్.

Author:

Pawan Kalyan helped college student

పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయంగా పవన్‌ మౌనంగా ఉన్నాడంటూ ఎన్ని ఆరోపణలు వచ్చినా… వ్యక్తిగతంగా తన మంచి మనసును పవన్ మరోసారి నిరూపించుకున్నాడు.పవన్ ట్విట్టర్‌కు డేగల లక్ష్మీదుర్గ అనే డిగ్రీ విద్యార్థిని ట్వీట్ చేసిందట. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన చదువు మధ్యలోనే ఆగిపోయేలా ఉందని… సహాయం చేయాలని పవన్ ట్విట్టర్‌కు లక్ష్మీ దుర్గ ట్వీట్ పెట్టింది. లక్ష్మీ ట్వీట్‌ను పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా చూసింది. ఈ విషయాన్ని పవన్‌కు చేరవేసింది కూడా.

ఈ విషయం తెలుసుకున్న పవన్ తన మేనేజర్‌తో డబ్బు పంపించి ఆ విద్యార్థినికి సహాయం చేశాడట. సాయం అందిన అనంతరం లక్ష్మీ దుర్గ పవన్‌కు, రేణూదేశాయ్‌కు ధన్యవాదాలు తెలిపింది. దేవుడు మీతో ఉన్నాడని… తనకు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పేందుకు మాటలు రావడం లేదని చెప్పింది. రేణూ దేశాయ్ కూడా బాగా చదువుకుని… తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని రీట్వీట్ చేసింది. లక్ష్మీకి బంగారు భవిష్యత్‌ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ కి మంచి పనులు చేసిన వాటిని బయటకి చెప్పుకునే అలవాటు లేదు, అందుకే పవన్ కళ్యాణ్ పై అభిమానం రోజు రోజుకి పెరిగిపోతుంది.

(Visited 732 times, 1 visits today)