Home / Entertainment / Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.

Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.

Author:

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ప్రజా సమస్యలని అధ్యయనం చేయడానికి ఈరోజు నుండి తెలంగాణ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి జనసేన ప్రజా యాత్ర మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఇక పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారానని తెలిపారు. ఇక సినిమాలపై దృష్టి లేదన్నారు.

కరీంనగర్ లోని విలేకరుల సమావేశంలో ఈ విషయంపై మాట్లాడారు. సినిమాలకు స్వస్తి చెప్పినట్లేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చారు. నా దృష్టి అంతా రాజకీయాలపైనే ఉందని.. ఇక సినిమాలు చేయను అని ప్రకటించారు. ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం జనసేన యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కరీంనగర్ లో జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు, రేపు ఖమ్మం కొత్తగూడెంలో కార్యకర్తలతో సమావేశం అవ్వనున్నట్లు, ఈ నెల 27 న అనంతపురంలో జనసేన కార్యకర్తలతో సమావేశం అవ్వనున్నట్లు తెలిపారు.

(Visited 508 times, 1 visits today)