పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ అంటేనే క్రేజీ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిస్తే తెరపై మరో మాగిక్ కి సిద్దమైనట్టే. ఈ ఇద్దరి కలయిక అంటేనే ఒక సూపర్ హిట్ ఖాయం అన్నంతగా ఫిక్సైపోయారంతా. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ కూడా ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు.దాదాపు ఏడేళ్ళు పవన్ కళ్యాణ్ సక్సెస్ కు దూరంగా ఉండిపోయారు. ఖుషీ తర్వాత ఒక్క సరైన హిట్ లేకుండా పోయింది అలాంతి సమయంలో 2008లో పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘జల్సా’ అటు పవన్ కి సక్సెస్ నీ త్రివిక్రం కి స్టార్ హోదా నీ ఒకే సారి తీసుకొచ్చింది. ఆ యేడాది కి సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలబడింది.
జల్సా సినిమా వచ్చిన తరువాత నుంచీ మళ్ళీ పవన్ క్రేజ్ మరింత పెరిగింది. అందులో పవన్ తో త్రివిక్రమ్ పండించిన వినోదం ఫ్యాన్స్ని ఉర్రూతలూగించింది. ఈ ఇద్దరికీ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ కూదా తోడైంది ఇక పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ ‘జల్సా’ టీం సత్తా ఏమిటో మ్రో సారి చూపించింది. మొన్నటి దాకా టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలచిందీ చిత్రం. పైగా పవన్ తో ఒకసారి పనిచేసిన డైరెక్టర్ మరోసారి పనిచేస్తే ఆ చిత్రం ఫ్లాప్ అవుతుందనే రాంగ్ సెంటిమెంట్ ను కూడా తుడిచిపెట్టింది ‘అత్తారింటికి దారేది’.
ఈ నేపథ్యంలో పవన్ తో మరోమారు త్రివిక్రమ్ జోడీ కట్టబోతున్నాడంటే అది వారిద్దరి అభిమానులకూ ఆసక్తి కలిగించే అంశమే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే తదుపరి చిత్రం ‘కోబలి’ అని వినిపించింది కానీ అది నిజమో కాదో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అదేమీ కాదని, పవన్ తో త్రివిక్రమ్ తెరకెక్కించే మూడో సినిమా కూడా జల్సా,అత్తారింటికి దారేది ల లాగానే ఫుల్ లెన్త్ ఎంటర్ టైన్ మెంట్ అని తెలుస్తోంది.
ఈమధ్యనే దిల్ రాజు రిజిస్టర్ చేయించిన మూడు కొత్త టైటిల్స్ లో “జనగణమణ” అనే టైటిల్ పవన్ కోసమే అనీ,ఇదే పవన్ త్రివిక్రం ల కొత్త సినిమా అయుండొచ్చనీ గుస గుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో బిజీగా ఉన్నాడు, త్రివిక్రమ్ కూడా తన తాజా చిత్రం ‘అ…ఆ’ తెరకెక్కించే పనిలో బిజీగానే ఉన్నాడు. ఈ రెండు పూర్తికాగానే పవన్-త్రివిక్రమ్ ల మూడో సినిమా ఉంటుందని తెలుస్తోంది.మరి పవన్ త్రివిక్రమ్ ఇద్దరూ తమ కామినేషన్ లో ఇంకో హిట్ తో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.