Home / Inspiring Stories / కాపు ఉద్యమ నేత ముద్రగడని కలవనున్న పవన్ కళ్యాణ్.

కాపు ఉద్యమ నేత ముద్రగడని కలవనున్న పవన్ కళ్యాణ్.

Author:

Pawan-Kalyan-To-Meet-Mudragada-Padmanabham

కాపు ఉద్యమంని ముందుండి నడిపిస్తున్న ముద్రగడ పద్మనాభం తుని విధ్వంసం కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టాలని దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే, రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తున్నా ముద్రగడ మాత్రం దీక్షని విరమించటం లేదు, ముద్రగడకి సంఘీభావంగా కాపు కులానికి చెందిన నాయకులు అయిన చిరంజీవి, దాసరి, బొత్స సత్యనారాయణ, పల్లం రాజు తదితరులు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకొని చంద్రబాబుకి లేఖ రాసారు, ముద్రగడ విషయంలో ఏదో ఒక విధంగా కాపు లీడర్లు స్పందిస్తున్నారు కాని కాపులు తమ లీడర్ గా భావిస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు, ఇప్పటికే చాలామంది నేతలు మీడియా ముఖంగా పవన్ ని స్పందించాలని కోరినా ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు, పులకు సపోర్టు ఇవ్వడం వల్ల మిగతావర్గాలకు దూరమవుతానన్న భయం ఆయనలో ఉండడం వల్లే దీనిపై స్పందించలేదని తెలుస్తోంది. అయితే.. అలా చేయడం వల్ల బలమైన కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుండడంతో సున్నితమైన ఈ అంశంలో పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈరోజు లేక రేపు అయిన ముద్రగడని కలవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి, ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడని కలిసి, ఆ తరువాత కాపు ఉద్యమ నేతలతో భేటీ అయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి, అయితే.. పవన్ ముద్రగడను గనుక కలిస్తే.. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో ఆయన కోసం రాజమండ్రికి పెద్ద సంఖ్యలో కాపులు వస్తుండడంతో పోలీసులు ఇప్పటికే అక్కడ భద్రత పెంచి ముద్రగడని ఎవరు కలవకుండా నిలవరిస్తున్నారు, ఒక వేళ పవన్ కళ్యాణ్ ని కూడా ముద్రగడని కలవకుండా ఆపితే కాపులు మరింత రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కి ముద్రగడని కలిసేందుకు ఖచ్చితంగా అనుమతి ఇస్తారని కాపు ఉద్యమ నేతలు భావిస్తున్నారు. అలాగే. ఏపీ ప్రభుత్వంతో జన సేనానికి ఉన్న సంబంధాల నేపథ్యంలో పవన్ కు అడ్డు చెప్పకపోవచ్చని తెలుస్తోంది.

Must Share: తెలంగాణాలో రాబోయే కొత్త జిల్లాలు ఇవే.

(Visited 684 times, 1 visits today)