తెలుగు తెరపై అందాల ఆరబోతకు సిద్దం అంటోంది లావణ్యా త్రిపాఠి . ఈ అందాల భామ నానీ తో నటించిన “బలె బలే మగాడివోయ్” ఈ సెప్టెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మన్మథుడు నాగ్ సరసన నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” కూడా విడుదల కు సిద్దంగా వుంది. ఐతే ఇప్పటి వరకూ అమాయకంగా కనిపించిన ఈ బుట్టబొమ్మకు మడి కట్టుకుంటే లాభం లేదని అర్థమైనట్టుంది. తనకు హోంలీ గా ఉండే పాత్రలే వస్తూంటే ఇక తాను పెద్ద హీరోయిన్ గా ఎదగలేననుకుందేమో మొత్తానికి మనసులో మాటని బయట పెట్టేసింది.
గ్లామర్ రోల్స్ కూడా చేసి యూత్ ని ఆకట్టుకోవాలని అందాల ఆరబోతకి తాను సిద్దమే అని చెప్పేసింది. అంతే కాదు పవన్ కళ్యాన్, మహేష్ బాబుల తో నటించాలని ఉందంటూ నిర్మాతలకి ఓ హింటిచ్చేసింది. ఈ గ్రీన్ సిగ్నల్ కి నిర్మాతలు ఎంత రియాక్టయ్యారో తెలీదు గానీ. లావణ్యా త్రిపాఠి పిల్లని అర దుస్తుల్లో చూడాలని కుర్రాళ్ళు మాత్రం ఉవ్విళ్ళూరుతున్నారు. గ్లామర్ రోల్స్ అంటే ఓకే నే గానీ మరీ పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలు ఈ బ్యూటీ కి అంత త్వరగా తమ పక్కన చాన్సిస్తారా? అన్నదే అనుమానం అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. లావణ్యా త్రిపాఠి కోరిక ముందు పవన్ తీరుస్తాడా మహేష్ తీరుస్తాడా.. అన్నది చూడాలి. బెస్ట్ ఆఫ్ లక్ లావణ్యా త్రిపాఠి .
(Visited 87 times, 1 visits today)