Home / Latest Alajadi / రోజు రావి చెట్టును చూసిన, తాకినా అదృష్టమా..! దురదృష్టమా !.

రోజు రావి చెట్టును చూసిన, తాకినా అదృష్టమా..! దురదృష్టమా !.

Author:

చాలా మంది తెలిసో తెలియకో రావి చెట్టును రోజు తాకుతూ, పూజిస్తుంటారు. ఇలా చేయడం లాభమా! నష్టమా! అంటే నష్టమని చెబుతున్నాయి మన పురాణాలు. ఇలాంటి విషయాలు పురాణాల వరకు అవసరం లేకుండా మన పెద్ద వారిని అడిగినా చెబుతారు. ఇంటి పరిసర ప్రాంతంలో రావి చెట్టు ఉంటే వెంటనే దానిని నరికివేస్తారు. తెల్లవారు నిద్రలేవగానే రావి చెట్టు చూస్తే అష్ట దరిద్రాలు పట్టుకుంటాయి అని చెబుతుంటారు…. మరి దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

peepal-tree

పాల సముద్రం వలికిన సమయంలో లక్ష్మి దేవిని పెళ్లి చేసుకుంద్దాం అనుకున్నాడు శ్రీ మహా విష్ణువు. కానీ లక్ష్మి దేవి… నాకంటే పెద్దయిన అక్క జ్యేష్ఠ లక్ష్మి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోను అని అడిగింది. ఈ విషయంపై బాగా ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెలుతుంది. ముని చాలా పవిత్రంగా రోజు పూజలు చేయడం, శుభ్రంగా ఉండటం, నిత్యం హోమం గుండం, మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు. ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠ లక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది. దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలిపెడతాడు.

అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండటం ఇష్టంలేక నన్ను ఇక్కడికి నుండి ఎక్కడికైనా పంపించమని విష్ణు మూర్తిని ప్రాధేయపడుతుంది. దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడ దొరకదు అని చెబుతాడు. ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో ఐదు రోజులు ఎవరు రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని వరం ఇస్తాడు. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది. శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టమని పండితులు చెబుతున్నారు.

(Visited 2,035 times, 1 visits today)