Home / Entertainment / పెళ్లిచూపులు సినిమా రివ్యూ & రేటింగ్.

పెళ్లిచూపులు సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Pelli-Choopulu-Movie-Review-Rating

నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ, నందు, తదితరులు
దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌.
నిర్మాతలు: రాజ్‌ కందుకూరి, యష్‌ రంగినేని 
సంగీతం: వివేక్‌ సాగర్‌.

పెళ్లిచూపులు అనే సినిమా 1983 లో చంద్రమోహన్, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే పేరుతో విజయ్‌ దేవరకొండ (ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని స్నేహితుడు), రీతూ వర్మ హీరో, హీరోయిన్ లుగా కొత్త దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా ట్రైలర్ చూడగానే ఈ సినిమాలో ఎదో కొత్తదనం ఉండబోతుంది అన్న భావన ప్రేక్షకులకు కలిగించడంలో పెళ్ళి చూపులు టీం విజయం సాదించింది. మరి ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా కథ ఏలా ఉందో చదువండి.

కథ:

జీవితంలో ఒక గోల్ అంటూ ఏమి లేకుండా, ప్రతిరోజు ఇంట్లో తిట్లు తింటూ, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ మళ్ళీ మళ్ళీ రాస్తూ తనకున్న ఫ్రెండ్స్ తో సరదాగా జీవితాన్నిఎంజాయ్ చేసే కుర్రాడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ), ఎలాగైనా ఆస్ట్రేలియా వెళ్లి చదువుకోవాలని దానికి కావాల్సిన డబ్బులను సొంతంగా ఏదైనా వ్యాపారం చేసి సంపాదించుకోవాలని ఆలోచించే అమ్మాయి చిత్ర( రీతూ వర్మ), వీళ్లద్దరూ ఒక పెళ్ళిచూపుల సందర్భంలో కలుసుకొంటారు, చాలాసేపు మాట్లాడుకున్నాక అసలు ఈ పెళ్ళిచూపులు ఈ ఇద్దరికీ కాదని తెలుసుకొంటారు, కానీ వీళ్లిద్దరి మధ్య బిజినెస్ డీల్ మాత్రం కుదురుతుంది, బిజినెస్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేసాక విడిపోవాల్సి వస్తుంది, చివరకు వీళ్ళు విడిపోయారా..? బిజినెస్ ఏమైంది..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

సినిమా మొదలవడమే హీరో, హీరోయిన్ ల పెళ్లి చూపులతో మొదలవుతుంది, పెళ్లి చూపులలో ఒకరి గురుంచి ఒకరు తెలుసుకుంటారు, ఫస్టాఫ్ మొత్తం ఫుల్ కామెడీతో నడిచిపోతుంది, ప్రతి క్యారెక్టర్ తో కొత్త రకం కామెడీతో మనల్ని నవ్విస్తారు, ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీ సినిమాకే హైలైట్ గా ఉంటుంది, ఇంటర్వెల్ ఒక మంచి ట్విస్ట్ తో వస్తుంది.

సెకండ్ ఆఫ్ లో హీరో కి వేరే అమ్మాయితో పెళ్లి సెట్ అయిపోతుంది, హీరోయిన్ మాత్రం ఎలాగైనా బిజినెస్ చేయాలనీ హీరో ని పార్టనర్ గా చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారు, సెకండ్ ఆఫ్ కొంచెం సీరియస్ మూడ్ తో నడిచిపోయింది, ఫస్ట్ ఆఫ్ ఉన్నంత ఎంటెర్టైనమెంట్ సెకండ్ ఆఫ్ లో లేకపోవడం వల్ల కొంచెం డల్ గా అనిపిస్తుంది.

ఓవరాల్ గా సినిమా మాత్రం సూపర్ గా ఉంది, ముఖ్యంగా యూత్ కి ఫుల్ గా నచ్చేస్తుంది, రొటీన్ సినిమాలకి చాలా భిన్నంగా ఈ సినిమా ఉంది.

 నటీనటుల పనితీరు:

మొదటి సినిమా ఎవడే సుభ్రమణ్యంతో అందరు గుర్తించే స్థాయికి చేరుకున్న విజయ్, ఈ సినిమాతో ఇంకా పై స్థాయికి చేరుకుంటాడు, సినిమాలో చాలా సూపర్బ్ గా నటించాడు, ప్రతి సీన్లో చాలా సహజంగా నటించాడు, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. రీతూ వర్మ ఈ సినిమాలో చాలా చాలా బాగా నటించింది, తనది ఈ సినిమాలో స్ట్రాంగ్ క్యారెక్టర్, లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

మిగిలిన వాళ్లలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ప్రియదర్శి తన కామెడీ తో అదరగొట్టాడు, మున్ముందు అతణ్ని చాలా సినిమాల్లో చూసే అవకాశముంది, మిగిలిన వాళ్ళు అందరు బాగా చేశారు. స్పెషల్ రోల్ లో నందు కూడా బాగా చేశాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకి మేజర్ హైలైట్ లలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, వివేక్ సాగర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరికి నచ్చుతాయి, అందరు ఎంజాయ్ చేసేలా పాటలు ఉన్నాయి, నగేష్ కెమెరా పనితనం కూడా సినిమాను మరింత అందంగా మార్చింది, ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా ఉంది, తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీ సినిమా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం.

ఇక దర్శకుడి గురుంచి చెప్పాలంటే ట్విస్ట్ లు, కన్ఫ్యూషన్ లేకుండా చాలా సింపుల్ గా బోర్ కొట్టకుండా కథని చెప్పడంలో సక్సెస్ అయ్యాడు, ఫస్ట్ ఆఫ్ తను రాసుకున్న కామెడీ సినిమాకే హైలైట్, ఇది తన ఫస్ట్ సినిమానే అయిన చాలా సూపర్బ్ గా తీశాడు, ఎలాంటి డ్రామాకు అవకాశం లేకుండా అన్ని సీన్లని సహజంగా తీర్చిదిద్దిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే, కానీ సెకండ్ అఫ్ పై ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది, ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది, సెకండ్ ఆఫ్ లో ఇంకొన్ని కత్తెరలు పడితే అవుట్ ఫుట్ ఇంకా బాగా వచ్చేది, ఈ స్టోరీ పై దైర్యంగా పెట్టుబడి పెట్టి నిర్మాతలు రాజ్ కందుకూరి, యాష్ రంగినేని మనకి ఒక మంచి సినిమాని అందించారు.

ప్లస్ పాయింట్స్: 

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • కామెడీ 
  • ఫస్ట్ ఆఫ్
  • హీరో, హీరోయిన్ ల నటన.

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ అఫ్ లో కొన్ని సీన్లు
  • క్లైమాక్స్

అలజడి రేటింగ్: 3.5/5

పంచ్ లైన్:  ‘పెళ్లి చూపులకి మళ్ళీ మళ్ళీ వెళ్లొచ్చు..!’

(Visited 2,598 times, 1 visits today)