ఒక్క సారి అందర్నీ ఆశ్చర్యం లో ముంచెత్తింది అనుష్క. అందం ఏమాత్రం చెక్కు చెదిరినా ఇండస్ట్రీలో నిలబటం కష్టం. అక్కడితో కెరీర్ ప్రశ్నార్థకమే
అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్లకి, తమ అందాలూ, వొళ్ళూ కాపాడుకోవటానికి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడుపు మాడ్చుకొని మరీ తమ సైజులు మారకుండా చూసుకుంటూంటే. అసలు బాడీషేప్ తోనే అందాల తారగా నిలబడ్డ అనుష్క మాత్రం ఒక సాహసమే చేసింది. ఇందులో ఏమాత్రం తేడావచ్చినా ఆమె సినీ జీవితాన్నే కోల్పోవలసి వచ్చేది. కొన్ని రోజుల్లోనే లడ్డు లా తయారైన అనుష్క అదే స్పీడ్ లో మళ్ళీ తన
అసలు వొంపులని సరిచేసుకుంది.
విషయమేంటంటే ఆర్య హెరోగా రూపొందిన సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క దాదాపు ఇరవయ్ ఐదు కేజీల బరువు పెరిగింది. బరువు పెరగటం కోసం విపరీతంగా తినేసిందట అనుష్క. ఈ బరువంతా కేవలం శాకాహారం తోనే అవటం తో ఒక్క రోజులో పదినుంచీ పదిహేను నేతితో చేసిన చపాతీలూ, చీజ్ ఎక్కువగా తినేసిందట. బాహుబలి షూటింగ్ ఐపోగానే సైజ్ జీరో కోసం తన సైజులని భారీ స్తాయిలో పెంచేసిన అనుష్క. మళ్ళీ వెంటనే బరువు తగ్గించేసి రుద్రమ దేవి ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. బరువు తగ్గే ప్రయత్నం లో రోజుకి మూడు గంటలు సైక్లింగ్ చేసిన ఈ స్వీటీ షెట్టి ఆరొగ్య సమస్యలనెదుర్కొని కూడా తనపేరుకు తగ్గట్టే స్వీట్ గా తయరయ్యింది. ఈ మొత్తం లో ఎక్కడా బయట కనిపించలేదు ఏ ఫంక్షన్లకీ వెళ్ళ లేదు. కేవలం సైజ్ జీరో సెట్స్ మీద తప్ప ఎక్కడా అడుగు పెట్టలేదట.
స్వతహాగా యోగా టీచర్ ఐన అనుష్క అన్ని జాగ్రత్తలూ తీస్కున్నప్పటికీ, ఆమె చేసిన సాహసం తాను చేయలేనని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాననీ తోటి హేరొయిన్ సమంతా కితాబిచ్చేసింది. ఇదే సినిమాలో మరోముఖ్య పాత్రలో నటిస్తున్న సొనాల్ చౌహన్ కూడా అనుష్కని పొగడ్తలతో ముంచెత్తింది. తెలుగులో కూడా సైజ్ జీరో పేరుతోనే రానున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీతం, కోవెలమూడి ప్రకాష్ దర్షకత్వం వహిస్తున్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి అంత లావెక్కినా అనుష్క అందం ఏమాత్రం తగ్గలేదంటున్నారు పోస్టర్ చూసిన వాళ్ళు.