Home / Inspiring Stories / బ్యాంకు, ఏటీఎం దగ్గరికి వెళ్లకుండానే బ్యాలన్స్ చూసుకోవచ్చు, మనీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు.

బ్యాంకు, ఏటీఎం దగ్గరికి వెళ్లకుండానే బ్యాలన్స్ చూసుకోవచ్చు, మనీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు.

Author:

పాత 500, 1000 నోట్లు రద్దు చేసిన తర్వాత చిన్న చిన్న పనులకు బ్యాంకులకు వెళ్ళలేని పరిస్థితి. ఏ బ్యాంక్ ముందు చూసినా లైన్లలో జనాలు దర్శనమిస్తున్నారు. డబ్బులు వేయడానికి, తీయడానికి ఇప్పుడు చాల ఇబ్బందిగా మారింది. చివరకు అకౌంట్ బ్యాలన్స్ చూసుకోవాలన్న ATM వద్ద కూడా గంటల కొద్ది లైన్లలో నిలబడాలి. కొంతమందికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నా కూడా ఎల్లప్పుడు ఇంటర్నెట్ ఉండదు మరియు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఇలాంటి బాధలను అధిగమించేందుకు నేషనల్ పేమేంట్స్ కార్పోరేషన్ వారు అన్ని బ్యాంకులను సంప్రదించి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మీ ఫోన్ లొ బ్యాలెన్స్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా, సింపుల్ గా *99# డయల్ చేసి మీ బ్యాంకు ఖాతాకు సంబందించిన అన్ని పనులు బ్యాంకుకు వెళ్ళకుండానే చేసుకోవచ్చు.

*99# ను ఉపయోగించే విధానం:

1) మీ మొబైల్‌ నుంచి *99# కు డయల్‌ చేయాలి (NUUP  నుంచి, వెల్కమ్ మెసేజ్ వస్తుంది. ).  OK లేదా DISMISS మీద క్లిక్ చేయండి.

2) మీ బ్యాంకు యొక్క 3 లెటర్స్ షార్ట్ నేమ్ కాని, మీ బ్యాంకు యొక్క IFSC కోడ్ లోని మొదటి నాలుగు అక్షరాలు కాని, లేకపోతే 2 డిజిట్ డైరెక్ట్ కోడ్ కాని ఎంటర్ చెయ్యాలి. (ఉదాహరణకు: స్టేట్ బ్యాంకు షార్ట్ నేమ్ SBI, IFSC కోడ్ మొదటి నాలుగు అక్షరాలు SBIN,  డిజిట్ డైరెక్ట్ కోడ్ 41)

3) మీకు కావాల్సిన సదుపాయన్ని ఎంచుకోండి (1. ఎకౌంటు బ్యాలన్స్, 2. మినీ స్టేట్మెంట్, 3. ఫండ్స్ ట్రాన్స్ఫర్ 4. బ్యాంకు బట్టి ఇతర సదుపాయాలు ఉంటాయి.)

bank-balance

ఈ విధానంతో మనం ఇతరుల బ్యాంకు అకౌంట్ కి డబ్బులని చాలా సులభంగా ట్రాన్స్ ఫర్ చేయొచ్చు, ఇతరుల బ్యాంకు IFSC కోడ్, అకౌంట్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ ఉంటే వారి అకౌంట్ కి ఫోన్ ద్వారానే డబ్బులని ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.  బ్యాలన్స్ తెలుసుకోవాలంటే మన అకౌంట్ కి సంబంధించిన బ్యాంకు IFSC కోడ్ తెలిసుండాలి.  ఈ విధానం గురుంచి కింది వీడియోలో క్లుప్తంగా ఉంది చుడండి.

పైన చెప్పిన విధముగా మీ ఫోన్ నుండె బ్యాంకుకు లేదా ATM కు వెళ్ళకుండా అన్ని బ్యాంకు పనులు చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే ముందు మీ ఫోన్ నంబర్ మీ బ్యాంకు అకౌంట్ కి లింక్ అయ్యి ఉండాలి. అంటే మీరు మీ అకౌంట్ లో డబ్బులు వేసినా, తీసినా మీకు బ్యాంక్ నుండి మెసేజ్ వస్తే మీ ఫోన్ నంబర్ మీ అకౌంట్ కి లింక్ అయ్యి వున్నట్లే, లేదంటే మీరు ఒకసారి మీ బ్యాంకుకు వెళ్ళీ మీ ఫోన్ నంబర్ ని మీ అకౌంట్ కి లింక్ చేయించుకోవాలి.

Must Read: వరసగా మూడు రోజులు బ్యాంకులు బంద్.

(Visited 5,998 times, 1 visits today)