Home / Political / పాత 500 రూపాయల నోట్ల వినియోగాన్ని కుదించిన కేంద్రం.

పాత 500 రూపాయల నోట్ల వినియోగాన్ని కుదించిన కేంద్రం.

Author:

నల్లధనాన్ని వెలికితీయడం మరియు నకిలీ నోట్లను ఏరివేయాలన్న సదుద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8 న అప్పటివరకు వాడుకలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. కాని కొత్త కరెన్సీ అనుకున్న సమయానికి అందుబాటులోకి రాకపోవడంతో పాత నోట్లను కొన్ని ప్రభుత్వ సంస్థలకు చేసే చెల్లింపులు మరియు నిత్యవసరాల కొనుగోలుకు అనుమతిచింది. ఇంకా సామాన్యుల కష్టాలు తీరకపోవడంతో ఆ గడువును డిసెంబర్ 15 కి పొడిగించారు కాని కేవలం పాత 500 నోట్లు మాత్రమే వినియోగించాలని కోరారు.

petrol-with-old-500-note

కాని ఇంతలోనే ప్రభుత్వం మాటమార్చింది. డిసెంబర్ 15 గడువు నుండి పెట్రోల్ బంకులు, టోల్ గేట్లు మరియు విమానయాణ టిక్కెట్లను తీసివేశారు. డిసెంబర్ 2 తర్వాత పాత 500 రూపాయల నోట్లు పెట్రోల్ బంకులు, టోల్ గేట్లు వద్ద పనిచేయవు మరియు విమానయాణ టిక్కెట్లను కొనడానికి కూడా పనిచేయవు. ప్రభుత్వం తన ముందు నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుందో ఎవరికి అర్దం కావడంలేదు. పాత నోట్ల రద్దును మెజారిటి ప్రజలు అభినందిస్తున్నా, దానిని అమలు పరచడంలొ ప్రభుత్వం పూర్థిగా విఫలం అయ్యిందని చెప్పుకుంటునారు.

(Visited 226 times, 1 visits today)