Home / General / న్యూఇయర్ షాక్ : జనవరి ఒకటి నుంచి భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ రేట్లు

న్యూఇయర్ షాక్ : జనవరి ఒకటి నుంచి భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ రేట్లు

Author:

కొత్త సంవత్సరం మొదటి రోజునే వాహనదారులకు షాక్ తగలనుంది, గత సంవత్సరం కాలంగా అంతర్జాతీయంగా ఎక్కువగా తగ్గుతూ స్వల్పంగా పెరుగుతూ వస్తున్న ముడి చమురు ధరలని 2018 జనవరి ఒకటి నుండి పెంచనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముడి చమురు సంస్థ ప్రకటించింది, ముడి చమురు బ్యారెల్ ధరలను 4 శాతం పెంచుతున్నట్లు ధరల పట్టికని కూడా విడుదల చేసారు, వాళ్ళు పెంచిన ధరలకు అనుగుణంగా మనదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మినిస్ట్రీ అఫ్ ఎనర్జీ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం 2.15 దిర్హమ్స్ గా ఉన్న సూపర్ 98 పెట్రోల్ బ్యారల్ ధరను 4శాతం పెరిగి 2.24 దిర్హమ్స్ కి పెరిగింది. స్పెషల్ 95 పెట్రోల్ ధర 4శాతం పెరిగి 2.15 దిర్హమ్స్ అవుతుంది. డీజిల్ ధర 1.97 నుంచి 2.05 దిర్హమ్ కి పెరగనుంది. యావరేజ్ గా 4శాతం ధరలు పెరగనున్నాయి. యూఏఈ నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఇంధనం కూడా భారం కానుంది. ఈ మేరకు జనవరి ఒకటో తేదీ నుంచి రోజువారీ రేట్లలో కూడా కొంచెం ఎక్కువగానే పెరిగే అవకాశాలు ఉన్నాయి. న్యూఇయర్ రోజున డీజిల్, పెట్రోల్ రేట్లు ఏ మేరకు పెరుగుతాయో చూడాలి.

(Visited 226 times, 1 visits today)