Home / Latest Alajadi / ప్రతిరోజు మారిపోనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు…!

ప్రతిరోజు మారిపోనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు…!

Author:

ప్రతి 15 రోజులకి ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలని అంతర్జాతీయ మార్కెట్ ని అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంటుంది, ఇక నుండి ఈ విధానానికి చెక్ పెట్టి , ప్రతి రోజు అర్ధరాత్రి ధరలని సవరించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు డిమాండ్ కి అనుగుణంగా ప్రతిరోజూ మారిపోతుంటాయి, కానీ మన దగ్గర ప్రతి 15 రోజులకి ఒకసారి ధరలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ కంపెనీలు సవరించేవి, ఈ విధానం వల్ల నష్టాలు వస్తుండటంతో దానికి స్వస్తి చెప్పి  రోజుకు ఆరోజు.. ఆయా ఆయిల్ కంపెనీలే అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్ అనుసరించి పెట్రోల్, డీజిల్ ధరలను ఆరోజు అర్ధరాత్రి ధరలు నిర్ణయించుకునే విధంగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) నిర్ణయించింది.

పెట్రోల్, డీజిల్ రేట్లు మార్పు

పెట్రోల్, డీజిల్ ధరలను పైసలతో సహా ప్రతిరోజూ అర్ధరాత్రి ధరలపై నిర్ణయం తీసుకుంటాయి. ఇందుకోసం IOC ఎగ్జిక్యూటివ్ అధికారులతో పాటు అనుబంధ కంపెనీలు అయిన భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ అధికారులు, ప్రైవేట్ కంపెనీ అధికారులు కూడా పెట్రోల్, డీజిల్  ధరల నిర్ణయంలో పాలుపంచుకుంటారని తెలుస్తోంది. అంతర్జాతీయ ధరలలో మార్పులను అనుసరించి ప్రతిరోజు ధరలను ఆయా కంపెనీలే పైసలతో నిర్ణయించనున్నారు. ఈ పద్దతికి డైనమిక్ ఫ్యుయల్ ప్రైసింగ్ గా పేరు పెట్టారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు మారిపోతాయి.

(Visited 1,131 times, 1 visits today)