వాణిజ్య రాజధాని నగరమైన ముంబయిలో పెట్రోల్ ధర తొలిసారి రూ.90 దాటింది. ముంబయిలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ.89.97 పైసలు ఉండగా సోమవారం ఉదయానికి 11 పైసలు పెరిగి రూ.90.08కి చేరింది. ఇక డీజిల్ ధర ఇక్కడ రూ.78.58గా ఉంది. ఇక దేశంలోనే అత్యధికంగా పట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.96గా ఉండగా.. డీజిల్ ధర రూ.79.68గా నమోదైంది.
దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.72 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.74.02గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.84.54గా ఉండగా డీజిల్ ధర రూ.75.97గా నమోదైంది.
హైదరాబాద్ తో లీటర్ పెట్రోల్ ధర 87.70 రూపాయలకు చేరుకోగా….డీజిల్ ధర రూ.80.51గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.82.72, డీజిల్ ధర రూ.74.02కు చేరుకుంది.గత ఐదు నెలల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.4.66 పెరగగా.. డీజిల్ ధర రూ.రూ.6.35 పెరిగింది.
పెట్రోల్ రేట్లు పెరుగుతూ పోతుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని ధరలను నియంత్రించకుంటే త్వరలోనే లీటర్ పెట్రోల్ వందకు చేరుకునే అవకాశముందంటున్నారు.