Home / Latest Alajadi / ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడుతాయి.

ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడుతాయి.

Author:

తమ డిమాండ్లని నెరవేర్చాలని ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్న పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ప్రభుత్వం స్పందించకపోవటంతో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలనే నిర్ణయానికి వచ్చారు, ఆయిల్ కంపెనీల నుండి తమకి వచ్చే కమిషన్ ని పెంచాలని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి, కమిషన్ పెంపుతో పాటు , ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకి సెలవు ప్రకటించాలని, అలాగే ప్రతి రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్ బంకులు పనిచేయాలి అనే డిమాండ్లని ప్రభుత్వం ముందుకు తెచ్చాయి, ఈ డిమాండ్ ల సాధన కోసం జనవరిలోనే నిరవధిక సమ్మె చేయాలనీ నిర్ణయించారు కానీ ప్రభుత్వం నెల రోజుల్లో డిమాండ్ లని పరిష్కరిస్తాం అని హామీ ఇవ్వడంతో ఉద్యమాన్ని విరమించారు. 3 నెలలు అయిన సమస్యలని పరిష్కరించకపోకపోవడంతో మళ్ళీ ఉద్యమం చేయాలనీ నిర్ణయించారు.

Petrol-Bunk-Bandh

మే 10 నుండి డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేయాలనీ , మే 10 నుండి వచ్చే ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లని బంద్ చేసి , మే 15 నుండి ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకే పెట్రోల్ బంకులు పని చేయాలనీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి షిండే ప్రకటించారు, ప్రభుత్వం స్పందించి డిమాండ్లని పరిష్కరించేవరకు ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు, దక్షిణ భారత రాష్ట్రాలలో ఉన్న అన్ని పెట్రోల్ బంకులు ఈ ఉద్యమంలో పాల్గొంటాయి అని తెలిపారు.పెట్రోల్ బంకుల డీలర్ల డిమాండ్లకి ప్రభుత్వం త్వరగా స్పందించకుంటే వచ్చే నెలలో మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడే ఆవకాశం ఉంది.

(Visited 1,055 times, 1 visits today)