Home / Entertainment / మూవీ రివ్యూ: ‘పేట’

మూవీ రివ్యూ: ‘పేట’

Author:

2.ఓ తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పేట. కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఎన్నో వివాదాల మధ్య అతి కష్టం మీద రిలీజ్‌ అయ్యింది. తెలుగులో భారీ చిత్రాలు బరిలో ఉండటంతో పేటకు సరైన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అయితే రజనీ మేనియా కారణంగా అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి ఇన్ని కష్టాల మధ్య పేట తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది.? రజనీ మ్యాజిక్‌ రిపీట్ అయ్యిందా..?

కథ:

కాళీ(ర‌జ‌నీకాంత్‌) ఒక కాలేజ్‌లో హాస్ట‌ల్ వార్డెన్‌గా చేర‌తాడు. అక్క‌డ చోటు చేసుకునే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన స్టైల్‌లో ప‌రిష్క‌రిస్తాడు. ఒక ప్రేమ జంట‌ను కూడా క‌లుపుతాడు. అనుకోని ప‌రిస్థితుల్లో లోక‌ల్ గూండాతో గొడ‌వ పెట్టుకుంటాడు. అప్పుడే అత‌ని పేరు కాళీ కాదు… పేట అని, అత‌డిది ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ అని తెలుస్తుంది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సింహాచ‌లం(న‌వాజుద్దీన్‌) అనే రాజ‌కీయ పెద్ద నాయ‌కుడితో విభేదాలు ఉంటాయి. అవి ఏంటి? అస‌లు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ నుంచి పేట ఎందుకు వ‌చ్చాడు? మ‌ళ్లీ అక్క‌డ‌కు వెళ్లాడా? వెళ్లి ఏం చేశాడ‌న్న‌ది క‌థ‌.

అలజడి విశ్లేషణ:

పేట పక్కా కమర్షియల్‌ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా హీరో వేరే ప్రాంతంలో తన ఐడెంటినీ దాచి బతుకుతుండటం. ఓ భారీ యాక్షన్‌ ఫ్లాష్ బ్యాక్‌ ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్‌ లో చాలా సినిమాలు వచ్చాయి. రజనీ కూడా గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. తొలి భాగానికి ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌లతో నడిపించిన కార్తీక్‌, ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు.

petta-telugu-movie-review

రజనీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథలో పెద్దగా కొత్తదనమేమీ లేదు. పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటం కూడా తెలుగు ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. అనిరుధ్ అందించిన పాటలు తమిళ ప్రేక్షకులను అలరించినా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకోవటం కష్టమే. నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్‌ అనిపిస్తుంది. తిరు సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటుల

సూపర్ స్టార్ తన అభిమానుల్ని అలరించేలా కనిపించాడు. గత కొన్నేళ్లలో కనిపించిన బెస్ట్ లుక్ అంటే ‘పేట’లోనిదే. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. అభిమానుల్ని ఉర్రూతలూగించే రజనీ మార్కు మూమెంట్స్ ఇందులో చాలానే ఉన్నాయి. సినిమా అంతటా చాలా ఉత్సాహంగా కనిపించాడు రజనీ. నటన పరంగానూ ఆయన ఆకట్టుకున్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖి ఉన్నంతలో బాగానే చేశాడు కానీ.. ఆయన స్థాయికి తగ్గ పాత్ర ఇవ్వలేదు కార్తీక్. హీరో కుటుంబంలోని వాళ్లందరినీ చంపేశాక నవాజ్ ఇచ్చే హావభావాలు ఆయన ప్రత్యేకతను చాటి చెబుతాయి. విజయ్ సేతుపతి మరోసారి తనదైన శైలిలో ఎఫర్ట్ లెస్ గా జిత్తు పాత్రను చేసుకుపోయాడు. కానీ అతడి పాత్ర కూడా ఆశించిన స్థాయిలో లేదు. సిమ్రాన్.. త్రిషలకూ సరైన క్యారెక్టర్లు ఇవ్వలేదు. సిమ్రాన్ మళ్లీ సన్నబడి అందంగా తయారవడం విశేషం. త్రిష సినిమాలో ఉందంటే ఉంది అన్నట్లు కనిపిస్తుంది. బాబీ సింహా లాంటి మంచి నటుడిని కూడా కార్తీక్ ఉపయోగించుకోలేదు. శశికుమార్ పర్వాలేదు. మిగతా పాత్రధారుల గురించి చెప్పడానికేమీ లేదు.

ప్లస్ పాయింట్స్ :

  • రజనీకాంత్‌
  • ప్ర‌థ‌మార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

  • క‌థా, క‌థ‌నం
  • తమిళ నేటివిటి

పంచ్ లైన్:  ‘పేట’ ర‌జ‌నీ అభిమానుల‌కు వినోదాల తోట‌

రేటింగ్ :  2.75/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘పేట’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)