Home / Inspiring Stories / ఓ అమ్మాయి పర్స్ కొట్టేస్తుంటే మీరూ ఇలానే చూస్తూ ఉంటారా?

ఓ అమ్మాయి పర్స్ కొట్టేస్తుంటే మీరూ ఇలానే చూస్తూ ఉంటారా?

Author:

సాధారణంగా మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా పర్స్ కొట్టేస్తున్నట్టు కనపడితే వెంటనే పట్టుకుని నలుగురూ కలిసి చితకబాది మరీ పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాం. మనలో ఎక్కడలేని సంఘసంస్కర్తలు అప్పటికప్పుడు పుట్టుకొస్తారు. అదే పర్స్ కొట్టేసింది అమ్మాయి అయితే మీరు ఏం చేస్తారు? అలానే చితకబాది పోలీసులకి అప్పగిస్తారా ? ఇదేదో కాస్త ఇంటరెస్టింగ్ టాపిక్ లా ఉంది కదా ?

pickpocket-experiment-with-a-twist-girl

ఈ విషయం బేస్ చేసుకునే ఓ యువతీ యువకుల బృందం సీక్రెట్ కెమెరా పట్టుకుని రోడ్ మీద పడింది. చెప్తే నమ్మరు కానీ మీరే నేరుగా ఈ వీడియో చూసేయండి ఎక్కడో ఒక్కడు తప్ప ఎవరూ నోరు మెదపలేదండి, పోలీసులతో సహా సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు? చూడటానికి ఫన్నీ గా ఏదో కామెడీ వీడియోలా ఉన్నా ఇది నిజానికి చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియో చూసాక అయినా కాస్త ఆలోచించండి సీన్ లో ఉన్నది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా మీలో సంఘసంస్కర్తని నిద్రలేపండి లేదంటే ఏదో ఒకరోజు మీరూ మీ పర్స్ లు ఖాళీ చేసుకోవాల్సిందే మరి

(Visited 1,368 times, 1 visits today)