Home / Inspiring Stories / మీతో ప్లాస్టిక్ బ్యాగు ఉంటే 500 రూపాయల ఫైన్ కట్టాల్సిందే.

మీతో ప్లాస్టిక్ బ్యాగు ఉంటే 500 రూపాయల ఫైన్ కట్టాల్సిందే.

Author:

plastic bags banned in bangalore

పర్యావరణానికి చేటు చేస్తాయి అని తెలిసి కూడా మనం విచ్చలవిడిగా ప్లాస్టిక్ ని వినియోగిస్తున్నాం. ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వాలు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు తెలపడం మొదలుపెట్టాయి. ఈ విషయంలో కేరళ, కర్నాటక ప్రభుత్వాలు ముందున్నాయి. కర్నాటక ప్రభుత్వం పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించింది. మీరు ఈ మధ్య బెంగుళూరు కి వెళ్ళి ఉంటే ఈ విషయం అర్దం అవుతుంది. ప్రజల భాగస్వామ్యంతో చాలా వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. సూపర్ మార్కెట్ లలో ప్లాస్టిక్ బ్యాగులకు బదులు పేపర్ బ్యాగులు, కాటన్ బ్యాగులుఇస్తున్నారు.

ఐతే ఇంకా కొంత మంది ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు, వారికి బుద్ది చెప్పేందుకు బెంగళూరు మున్సిపాలిటీ కొత్త ఉపాయంతో ముందుకు వచ్చింది. మీరు ప్లాస్టిక్ బ్యాగు వాడుతూ అధికారులకు కనపడితే అక్కడికక్కడే 500 రూపాయల ఫైన్ విదిస్తారు, మరోసారి పట్టుబడితే 1000 రూపాయల జరిమాన విదిన్చనున్నారు. అదే విధంగా ప్లాస్టిక్ బ్యాగులు, ఫ్లెక్సీలు గాని తయారుచేస్తే 5 లక్షల రూపాయల ఫైన్ తో పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్తే ప్లాస్టిక్ బ్యాగులు పట్టుకొని తిరగకండి. కేరళ లో ఐతే జరిమానా లు భారీ ఎత్తున ఉన్నాయి, ప్లాస్టిక్ బ్యాగు వాడితే 5000 రూపాయల ఫైన్ వేస్తారు.

ఇలాంటి చర్యలు మన తెలుగు రాష్ట్రాలు కూడా తీసుకుంటే పార్యావరణానికి మేలు చేసిన వారు అవుతారు. ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్దాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ చూసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు కనపడుతూనే ఉంటాయి. అవి అలా సంవత్సరాలు భూమిలో కలిసిపోకుండా కాలుష్యానికి కారణం అవుతాయి. దయచేసి ఇప్పటినుండి అయిన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి.

(Visited 213 times, 1 visits today)