Home / Political / దొంగ ఓట్లు వేయడం కోరకు నకీలీ వేళ్ళు తయారు చేసిన ముఠా.

దొంగ ఓట్లు వేయడం కోరకు నకీలీ వేళ్ళు తయారు చేసిన ముఠా.

Author:

మన వాళ్ళు టెక్నాలజీని మంచి కోసం ఎంత వాడుతున్నారో చెడు కు కూడా అంతే వాడుతున్నారు, అలాంటి ఘటణ ఒకటి ముంబాయి లో వెలుగుచూసింది. భారతదేశంలో వోటు వేసిన వారికి వేలుపై సిరా గుర్తు పెడతారు, దాని వలన వారు అదే రోజు రెండవ సారి వోటు వేసే అవకాశం ఉండదు. కాని దొంగ వోట్లకు అలవాటు పడిన నేతలు ఎన్నికల అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేసి దొంగ వోట్లు వేయిస్తున్నారు. అందులో భాగంగానే అచ్చం చేతి వేళ్ళలాగే ఉండే నకిలీ ప్లాస్టిక్ తొడుగులను తయారు చేయించి తమ కార్యకర్తలకు పంచి దొంగ వోట్లు వేయించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నకిలీ ప్లాస్టిక్ తొడుగులను చేతి వేలు కు తొడిగి ఒక వోటు వేసాక ఎన్నికల అధికారులు ఆ వేలుపై సిరా పూస్తారు కాని అదే వ్యక్తి బయటకు వెళ్ళి ఆ నకిలీ ప్లాస్టిక్ తొడుగుని తీసేసి ఇంకో తొడుగు వేసుకొని దొంగ వోటు వేసే అవకాశం ఉంది.

plastic fingers for voting

ఈ మాస్టర్ ప్లానును మహారాష్ట్రలోని పది మున్సిపల్‌ కార్పొరేషన్లు, పలు జిల్లా పరిషత్‌లకు జరుగుతున్న ఎన్నికల్లో అమలు పరచడానికి సిద్దం చేసుకున్నారు కాని ఈ విషయం ముందే పోలీసులకు తెలిసిపోవడంతో వారి భండారం బయటపడింది. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు, ఎన్నికల అధికారులు ఈ ప్లాస్టిక్ వేళ్ళు నాసిక్ లో తయారైనట్లుగా గుర్తించారు. ఏది ఎమైనా మంచి పనులతో ప్రజలను మెప్పించి వారి వోట్లతో సీట్లు గెలవాల్సిన నాయకులు ఇలా అడ్డదారులు తొక్కడం నిజంగా విచారకరం.

(Visited 462 times, 1 visits today)